ఎప్పుడు ఛస్తాడాని ఎదురుచూపులు : బ్రతికుండగానే వ్యక్తిని శ్మశానానికి తీసుకెళ్లిన కుటుంబం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కలికాలం..అందులోను కరోనా కాలంలో జరిగే దారుణాల గురించి వింటుంటే ఒళ్ళు గగొర్పొడుస్తోంది. మనిషిలో ఉండే మానవత్వం రోజురోజుకీ చచ్చిపోతో? అనే ఆందోళన కలుగుతోంది. బతికున్న వ్యక్తి ఎప్పుడు పోతాడా అన్నట్టుగా సమాజం ఎదురుచూస్తున్న రోజులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అటువంటి ఘటన ప్రకాశంజిల్లాలో చోటుచేసుకుంది. అనారోగ్యంతో ఉన్న వ్యక్తి బతికే అవకాశం లేదని డాక్టర్లు చెప్పడంతో అతని కుటుంబ సభ్యులు అతన్ని ఇంటికి తీసుకెళ్లకుండా ఏకంగా నేరుగా శ్మశానానికి తీసుకెళ్లారు. అదీ అతను ప్రాణాలతోనే ఉండగానే. ఆ..ఇంకెంతసేపు బతుకుతాడులే అనుకుంటూ ఏకంగా అంత్యక్రియలకు ఏర్పాట్లు కూడా చేసేసిన దారుణ ఘటన ప్రకాశం జిల్లా కందుకూరులో జరిగింది.వెంకటేశ్వర్లు అనే 55 అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యాడు. పక్షవాతం కూడా వచ్చింది. ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించటంతో ఒంగోలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ కూడా అతను బతికే అవకాశ లేదని..రెండు రోజులకు మించి బ్రతకడని డాక్టర్లు చెప్పడంతో ఇంటికి బయలుదేరారు.

వారికి సొంత ఇల్లు లేదు..అద్దె ఇంట్లో ఉంటున్నారు. దీంతో అతను చనిపోయేలా ఉండటం..పైగా కరోనా వైరస్ నేపథ్యంలో ఇంటి యజమాని లోపలికి రానివ్వడనే భయంతో అతను బ్రతికి ఉండగానే నేరుగా శ్మశానానికి తీసుకెళ్లారు. కొన ఊపిరితో ఉండగానే చావు కోసం ఎదురుచూస్తూ కూర్చున్నారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకడంతో స్థానికులంతా తిట్టిపోశారు. మీరు మనుషులేనా..బుద్ధిలేదా అని తిట్టటంతో మళ్లీ ఆస్పత్రికి తీసుకెళ్లారు.దీనిపై కుటుంబ సభ్యుల్ని ప్రశ్నించగా..జీజీహెచ్, ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్స్, వెంటిలేటర్స్ లేవంటూ అడ్మిషన్ ఇవ్వలేదని..రెండు గంటకు మించి బత్రకడని డాక్టర్లు చెప్పారని..ఇంటి యజమాని మమ్మల్ని ఇంటికి రానివ్వడని ఇలా శ్మశానానికి తీసుకొచ్చిమని చెబుతున్నారు. కరోనా పరీక్ష నిర్వహించినా నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందని చెబుతున్నారు. బతికున్న వ్యక్తిని శ్మశానంలో వదిలేయడంపై కందుకూరులో కలకలం రేగింది. ఆ తరువాతి రోజే అతను మరణించినట్లుగా సమాచారం.

Related Posts