prakash raj to contest from bangalore central  | 10TV

లోక్ సభకు ప్రకాష్ రాజ్ : నియోజకవర్గం ఇదే

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

బెంగళూరు : ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ పొలిటికల్ ఎంట్రీపై ఒక క్లారిటీ వచ్చేసింది. వచ్చే లోక్ సభ ఎన్నికల బరిలో ఆయన నిలువనున్నారు. కానీ ఎక్కడి నుండి పోటీ చేస్తారనే దానిపై ఉత్కంఠ ఉండేది. అది కూడా వీడిపోయింది. ప్రకాష్…బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నారు. స్వయంగా ప్రకాశ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నియోజకవర్గం నుండి 2014 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పీసీ మోహన్ విజయం సాధించారు. 
గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పిస్తున్న ప్రకాశ్…మరింత దూకుడును ప్రదర్శిస్తున్నారు. ఇతని పొలిటికల్ ఎంట్రీపై పలు రాజకీయ పార్టీలు కూడా స్పందించాయి. ఆప్ మద్దతు తెలపగా..కేటీఆర్ వెల్ కం చెప్పారు. ప్రకాష్ రాజ్ ను జేడీయూ-కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థిగా కర్ణాటక నుంచి బరిలోకి దింపాలని కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

Related Posts