లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Viral

చంపేస్తారా.. ఎవరూ లేరనుకున్నారా? రాహుల్‌కు ప్రకాష్ రాజ్ మద్దతు

నటుడు ప్రకాష్ రాజ్.. సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌కు మద్దతు తెలిపారు..

Published

on

Prakash Raj & Rahul Meet Telangana Chief Whip Vinay Bhaskar

నటుడు ప్రకాష్ రాజ్.. సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌కు మద్దతు తెలిపారు..

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్.. సింగర్, తెలుగు బిగ్‌బాస్-3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్‌కు మద్దతు తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రిజమ్ పబ్‌లో  రాహుల్‌పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. సీసీటీవీ ఫుటేజ్ వీడియోనే షేర్ చేస్తూ, తనకు న్యాయం చేయాలంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు కూడా విజ్ఞప్తి చేశాడు రాహుల్.

అయితే తాజాగా ప్రకాష్ రాజ్, రాహుల్‌ను తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ వద్దకు తీసుకెళ్లారు. కృష్ణవంశీ దర్శకత్వంలో నటిస్తున్న ‘రంగమార్తాండ’ షూటింగ్ నుంచి నేరుగా అసెంబ్లీకి వెళ్లిన ప్రకాష్ రాజ్.. కేవలం హోలీ శుభాకాంక్షలు తెలియచేయడానికి మాత్రమే వినయ్ భాస్కర్‌ను కలిశామని, తమ మధ్య రాహుల్‌పై దాడి ప్రస్తావన రాలేదని తెలిపారు.

‘రాహుల్ మీద దాడి చేసివ వాళ్లు పెద్దవాళ్లైనా ఎవరైనా శిక్ష పడాల్సిందే.. పబ్ లకెళ్లడం తప్పని చెప్పడంలేదు.. కానీ బాటిల్స్‌తో అలా కొట్టడం.. చంపేస్తారా ఏంటి.. అలాకాదు.. ఆ అహంకారం తప్పు.. నేను రేపు కమీషనర్‌తో కూడా మాట్లాడతాను.. రాహుల్ కోసం మేం నిలబడతాం.. తనకి కాస్త ధైర్యమిస్తున్నానంతే’.. అంటూ ప్రకాష్ రాజ్ మీడియాకు తెలిపారు.  

Prakash Raj & Rahul Meet Telangana Chief Whip Vinay Bhaskar

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *