Home » పవన్ కళ్యాణ్ తీరు ఊసరవెల్లిలా ఉంది – ప్రకాష్ రాజ్
Published
2 months agoon
By
madhuPrakash Raj’s criticism of Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. ఓ ఇంటర్వ్యూలో పవన్ తీరుపై నిర్మోహమాటంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ ఆయన తీసుకున్న నిర్ణయం తనను డిజప్పాయింట్ చేసిందన్నారు. పవన్‌కు ఒక పార్టీ ఉండి.. కూడా మరో పార్టీని బలపర్చడం ఏంటో తనకు అర్థం కాలేదన్నారు.
పవన్ ఒక నాయకుడని, ఆయనకు ఒక పార్టీ ఉందనే విషయం మరిచిపోయి ప్రవర్తిస్తున్నారని ప్రకాశ్ రాజ్ విమర్శించారు. తెలుగు రాష్ట్రాల్లో గత ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ ఓటింగ్ శాతం ఎంతో తెలిసి కూడా ఆ పార్టీతో పొత్తుపెట్టుకోవడం వెనుక లాజిక్ ఎంటో అర్థమవ్వడం లేదన్నారు. అలాగే 2014లో ఎన్‌డిఏకు మద్దతిచ్చి, పోటీ చేయకుండా ప్రచారం చేసిన పవన్.. 2019లో ఆ పార్టీని పక్కనెట్టి లెఫ్ట్ పార్టీలతో జతకట్టారని.. మళ్లీ 2020లో బీజేపీకి ఎందుకు మద్ధతు ఇస్తున్నారని ప్రశ్నించారు. ఇవన్నీ చూస్తుంటే.. ఆయనని ఊసరవెల్లిగానే ప్రజలు భావిస్తారని ప్రకాష్ రాజ్ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తొలుత పోటీ చేస్తామని జనసేన ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ..అనూహ్యంగా ఎన్నికల బరి నుంచి తప్పుకుంది. బీజేపీకి మద్దతిస్తున్నామని వెల్లడించింది. ఎన్నికల ప్రచార సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారని ప్రచారం జరిగింది. పవన్ ఒక్కరే ప్రచారం నిర్వహించడానికి బదులుగా అమిత్ షా, నడ్డా ప్రచార సభలో పాల్గొనే అవకాశం ఉంది. ఎన్నికల ప్రచారం చివరి రోజు పవన్ రోడ్ షోల్లో పాల్గొంటే బీజేపీకి లాభిస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే వ్యక్తిగత రోడ్ షోలకు పవన్ నో చెప్పినట్లు తెలుస్తోంది.