లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

నా ప్రాణం తొలి గానం పాడే వేళ – ‘జాను’ బ్యూటిఫుల్ మెలోడి

యంగ్ హీరో శర్వానంద్, సమంత జంటగా నటిస్తున్న ‘96’ రీమేక్ ‘జాను’ మూవీలో నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్..

Published

on

Pranam Lyrical Video from Jaanu

యంగ్ హీరో శర్వానంద్, సమంత జంటగా నటిస్తున్న ‘96’ రీమేక్ ‘జాను’ మూవీలో నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్..

యంగ్ హీరో శర్వానంద్, సమంత జంటగా.. తమిళ నాట సంచలన విజయం సాధించిన ‘96’ చిత్రాన్ని తెలుగులో ‘జాను’ పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తుండగా ఒరిజినల్ వెర్షన్ డైరెక్ట్ చేసిన సి.ప్రేమ్ కుమార్ రీమేక్ కూడా తెరకెక్కిస్తున్నారు.

మంగళవారం సాయంత్రం ‘జాను’ నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. గోవింద్ వసంత ట్యూన్ కంపోజ్ చేయగా.. శ్రీమణి అందమైన పదాలు రాశారు.. చిన్మయి, గౌతమ్ భరద్వాజ్ అద్భుతంగా పాడారు.

Read Also : మరో మైలురాయిని చేరిన మహేష్ మూవీ

ప్రేమలోని మాధుర్యం, ప్రేమికుల భావాలు ఉట్టిపడేలా ఉన్న ఈ పాట యువతను ముఖ్యంగా ప్రేమలో ఉన్న వారిని విశేషంగా ఆకట్టుకుంటోంది. త్వరలో ‘జాను’ విడుదల తేదిని ప్రకటించనున్నారు. కెమెరా : మహేంద్రన్ జయరాజు, ఎడిటింగ్ : ప్రవీణ్ కె ఎల్, సంగీతం : గోవింద్ వసంత.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *