లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

కరోనా వ్యాక్సిన్ ఎక్స్ పైరీ గడువు ఆరు నెలలు మాత్రమే!

Updated On - 3:44 pm, Wed, 27 January 21

Pre-produced Covishield, Covaxin in 6-month : కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు వ్యాక్సిన్ ను రూపొందిస్తున్నాయి. ఇప్పటికే పలు దేశాలు వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియను వేగవంతం చేశాయి. భారతదేశంలో కూడా ప్రజలకు వ్యాక్సిన్ పంపిణీ జోరుగా కొనసాగుతోంది. ఈ క్రమంలో నిపుణులు కీలక సూచనలు చేశారు. అందుబాటులో ఉన్న టీకాలను వెంటనే వినియోగించాలని, వాటి ఎక్స్ పైరీ గడువు ఆరు నెలలు మాత్రమే ఉంటుందని వెల్లడించారు. వీలైనంత త్వరగా…అందరికీ టీకాలు వేయాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా…ఉత్పత్తి అవుతున్న టీకాల తయారైనప్పటి నుంచి ఆరు నెలల మాత్రమేనని స్పష్టం చేస్తున్నారు.

భారతదేశంలో రెండు కంపెనీలు టీకాలను  (Covishield, Covaxin) తొలి దశలో ఇస్తున్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ వీటిని అందిస్తున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి…వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. ఇప్పటి వరకు 20 లక్షల మందికి మాత్రమే టీకాలు వేశారు. ఓ కంపెనీ ఇప్పటికే 2 కోట్ల డోసులను ప్రభుత్వానికి అందచేసింది. మరో 60 లక్షల కోట్ల డోసులు కంపెనీ వద్ద ఉన్నటట్లు సమాచారం. అందుబాటులో ఉన్న టీకాలను ఆరు నెలలోపు వినియోగించుకోలేకపోతే…అవన్నీ ఎందుకు పనికి రాకుండా పోతాయనే ఆందోళన వ్యక్తమౌతోంది. టీకా వినియోగ గడువును తయారీ తేదీ నుంచి గరిష్టంగా..ఏడాదిపాటు…ఉండేలా చూడాలని కంపెనీలు భావిస్తున్నాయి. ఇందుకు పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. శాస్త్రవేత్తల పరిశోధనలు సక్సెస్ అయితే…బాగుంటుందని అనుకుంటున్నారు.