లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Andhrapradesh

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధం..కోవిడ్‌ నెగెటివ్‌ ఉంటేనే అనుమతి

Published

on

AP assembly meetings : ఏపి అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సర్వం సిద్ధమైంది.. సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు అసెంబ్లీ, పది గంటలకు శాసన మండలి ప్రారంభం కానుంది. కోవిడ్ నేపధ్యంలో సమావేశాలు కేవలం ఐదు రోజులు మాత్రమే నిర్వమించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే అసెంబ్లీ సమావేశాలు కనీసం పది రోజులు అయినా జరపాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు. ప్రజా సమస్యలను చర్చించే ధైర్యం లేక ప్రభుత్వం పారిపోతోందిని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. ఈ సారి జరిగే సమావేశాల్లో ప్రశ్నత్తోరాలు లేనట్లు తెలుస్తోంది. ప్రశ్నోత్తరాలు ఉండాల్సిందేనని టీడీపీ ఎమ్మెల్సీలు మండలి ఛైర్మెన్ షరీఫ్ కు లేఖ రాశారు. అయితే సమావేశాలు తక్కువ రోజులు నిర్వహిస్తున్నందున కొశ్ఛనవర్‌ను రద్దు చేయనున్నట్లు తెలుస్తోంది.అసెంబ్లీ నిర్వహణపై మండలి చైర్మన్‌ షరీఫ్, అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్వహించిన సమావేశంలో ప్రశ్నోత్తరాల సమయం ఉండాలని చైర్మన్ షరీఫ్ స్పష్టం చేశారు. ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవడం సభ్యుల ప్రాథమిక హక్కు అన్నారు. అలాగే జీరో అవర్ లో స్థానిక సమస్యల పరిష్కారం అయ్యేందుకు ఉపయోపడుతుందన్నారు. అయితే ఈ విషయం స్పీకర్ తమ్మినేని సీతారాం కానీ, ప్రభుత్వం కానీ ఎలాంటి హామీ ఇవ్వలేదు. బీఏసీ సమావేశంలో తెలుగుదేశం పార్టీ కొశ్ఛనవర్ కోసం పట్టుపట్టనుంది.ఈ అసెంబ్లీ సమావేశాల్లో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది వైసీపీ ప్రభుత్వం. 15 బిల్లులకు ఆమోదం తెలిపేందుకు అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొన్ని బిల్లులకు 27న జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. నాణ్యమైన పశుదాణా ఉత్పత్తి, పంపిణీ బిల్లు, ఏపీ ఫిషరీస్‌ యూనివర్సిటీ బిల్లు, ఏపీ గేమింగ్‌ యాక్ట్‌ను సవరిస్తూ ఆన్‌లైన్ గేమింగ్‌, గ్యాంబ్లింగ్‌పై నాన్‌ బెయిలబుల్‌ కేసులు పెట్టేలా ఆర్డినెన్స్‌కు ఆమోదం, గేమింగ్‌ చట్టం సవరణ బిల్లు, పట్టణ ప్రాంతాల్లో ఆస్తిపన్ను సవరణ బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు కేబినేట్‌ ఆమోదం తెలిపింది.. సమావేశాలు ప్రారంభం రోజునే బిల్లులన్నీ సిద్ధం చేయాలని స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రభుత్వానికి సూచించారు. స్పీకర్ సూచనను బట్టి మొదటి రోజే బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం వుంది.అసెంబ్లీ సమావేశాలకు మంత్రులు హోంవర్క్‌ చేసి రావాలని సిఎం జన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ప్రతిపక్షాలు ఏ అంశాన్ని లేవనెత్తినా గట్టిగా సమాధానం చెప్పాలని మంత్రి వర్గ సహచరులకు సిఎం జగన్ సూచించారు. మంత్రులంతా సభా వ్యవహారాల, ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధరెడ్డి తో సమన్వయం చేసుకోవాలన్నారు సీఎం జగన్‌..మరోవైపు అసెంబ్లీ సమావేశాలకు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు.. ఇప్పటికే సీఎం, ఇతర ముఖ్యుల కాన్వాయ్‌ల రిహార్సల్స్ నిర్వహించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వాహనాల పార్కింగ్ కోసం స్థలాలను గుర్తించారు. ముఖ్యంగా సమావేశాలు జరిగే సమయంలో అసెంబ్లీ చుట్టు పక్కల ఎటువంటి ఆందోళనలు, అసాంఘిక కార్యాకలాపాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ముఖ్యంగా కొవిడ్ ను దృష్టిలో పెట్టుకుని… కరోనా పరీక్షలు నిర్వహించి నెగిటివ్ రిపోర్టు వచ్చిన తరవాతే ప్రజాప్రతినిధుల భద్రతా సిబ్బంది, ఇతర పోలీసు సిబ్బందికి అనుమతించనున్నారు.అసెంబ్లీ సమావేశాలు తక్కువ రోజులు జరిగినా ఎక్కువ సమస్యలను ప్రస్తావించాలని టీడీపీ పట్టుపట్టే అవకాశం కనిపిస్తోంది…. మరోవైపు ప్రభుత్వం కూడా టీడీపీ నేతలకు కౌంటర్‌ ఇవ్వడానికి వ్యూహాత్మకంగా వ్యవహరించేందుకు అస్త్రశస్త్రాలతో సిద్దంగా వుంది. దీనితో అసెంబ్లీ సమావేశాలు వాడిగా వేడిగా జరుగడం ఖాయంగా కనిపిస్తోంది..

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *