Prepare for the launch of the Gachibowli Biodiversity Flyover

అందుబాటులోకి మరో ఫ్లైఓవర్ : గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ప్రారంభానికి సిద్ధం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

హైదరాబాద్ నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సమగ్ర రోడ్ల అభివృద్ధి ప్రాజెక్టులో మరొక ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. గచ్చిబౌలి బయోడైవర్సీటి  వద్ద నిర్మించిన భారీ ఫ్లైఓవర్ 2019, నవంబర్ 03వ తేదీ సోమవారం ప్రారంభం కానుంది. మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్, జిహెచ్ఎంసి మేయర్ బోంతు రామ్మెహన్  ఫ్లైఓవర్‌ను ప్రారంభించనున్నారు. SRDP ప్రాజెక్టులో ఇప్పటికే మూడు అండర్ పాస్‌లు, నాలుగు ఫ్లైఓవర్లు అందుబాటులోకి రాగా… మరొక ఫ్లైఓవర్ వాహనదారులకు అందుబాటులోకి వస్తుంది.

Read More : ఆర్టీసీ మహిళా కార్మికురాలిపై సీఐ జులుం
ఖాజాగూడ నుంచి మైండ్ స్పేస్ వైపు వెళ్లే వాహనదారులకు ఇక ట్రాఫిక్ సమస్యలు తీరినట్టే అని భావిస్తున్నారు. వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ప్రణాళిక (ఎస్ఆర్‌డీపీ)లో భాగంగా బయోడైవర్సిటీ జంక్షన్‌లో రెండు ఫ్లై ఓవర్ల నిర్మాణం చేపట్టారు. అందులో ప్రస్తుతం రూ. 69.47 కోట్ల వ్యయంతో మెహిదీపట్నం – ఖాజాగూడ మార్గంలో చేపట్టిన సెకండ్ లెవల్ ఫ్లై ఓవర్ సిద్ధమైంది. భూ సేకరణలో సమస్యల వల్ల కొంత ఆలస్యమైంది. ఇటీవలే భూ సేకరణకు మార్గం సుగమం కావడంతో త్వరలోనే మొదటి లెవల్ ఫ్లై ఓవర్ కూడా పూర్తవుతుందని అధికారులు వెల్లడిస్తున్నారు.
Will be opening the Biodiversity junction flyover tomorrow to citizens of Hyderabad

Also laying foundation for another important flyover from Silpa Layout (lane next to IKEA) going all the way to ORR expressway

Many junction improvements have been taken up in #SRDP pic.twitter.com/8EQRTFpGtj

Related Posts