లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

కళకళలాడుతున్న మహాబలిపురం : భారత్‌కు చైనా అధ్యక్షుడు 

Published

on

President of China Visit India

చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ భారత దేశానికి రాబోతున్నారు. అక్టోబర్ 11 – 12 తేదీల్లో ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారైంది. చెన్నైలో ఆయన పర్యటించనున్నారు. ఇరుదేశాధినేతలు కాంచీపురం జిల్లాలోని మహాలిపురం వేదికగా చర్చలు జరుపనున్నారు. భేటీ జరిగే ప్రాంతంతో పాటు మహాబలిపురాన్ని సుందరంగా అలంకరిస్తున్నారు. మోడీతో రెండో అనధికారిక శిఖరాగ్ర సమావేశంలో జిన్ పింగ్ పాల్గొనున్నారు. ఇరు దేశాల మద్య అనేక అంశాలపై మోదీ, జిన్ పింగ్ ద్యైపాక్షిక చర్చలు జరుపనున్నారు. కేంద్ర, రాష్ట్ర నిఘా విభాగం మహాబలిపురాన్ని ఆధీనంలోకి తీసుకుంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లను పరిశిస్తున్నారు. 

గత సంవత్సరం రెండు రోజుల పాటు పీఎం మోడీ చైనాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భారతదేశానికి రావాలని మోడీ..జిన్ పింగ్‌ను ఆహ్వానించారు. భారత్ – చైనా మధ్య దౌత్య సంబంధాలకు వచ్చే ఏడాదితో 70 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఇరు దేశాల్లో 70 కార్యక్రమాలు జరిగే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 
ఇదలా ఉంటే..జిన్ పింగ్ భారత పర్యటనకు ముందే..పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చైనా వెళుతుండడం ఆసక్తి కలిగిస్తోంది. కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు అనంతరం భారత్ – పాక్ మధ్య సంబంధాలు క్షీణించిన సంగతి తెలిసిందే. బీజింగ్‌లోని ముఖ్య నేతలను ఇమ్రాన్ కలువనున్నారు. చైనా – పాక్ బిజినెస్ ఫోరంలో పాల్గొని ప్రసంగించనున్నారు. 
Read More : 
 

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *