భారతదేశ సంగీత ప్రియులకు ఎస్పీబీ మరణం తీరనిలోటు.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

President of India Tribute to SPB: ప్రముఖ నేపథ్య గాయకులు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం(74) చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గాయకుడిగా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్రవేసిన బాలు మరణంతో సినీ పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది.

బాలు మరణవార్త వినగానే తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ సినీ పరిశ్రమ వర్గాలు షాక్ అయ్యాయి. సంగీత ప్రియులు, బాలు అభిమానులు ఆయన మరణ వార్తతో శోక సంద్రంలో మునిగిపోయారు. బాలు మృతికి సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియచేస్తున్నారు. గానగంధర్వుడికి శోకతప్త హృదయంతో అశృనివాళులు అర్పిస్తున్నారు.


భారతీయ సంగీతం అత్యంత అద్భుతమైన ఓ స్వరాన్ని కోల్పోయిందని భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. యావత్ దేశ సంగీత ప్రియులకు ఎస్పీబీ మరణం తీరనిలోటు అని రాష్ట్రపతి ట్వీట్ చేశారు.

గాన చంద్రుడిగా పిలుచుకునే బాలసుబ్రహ్మణ్యం.. పద్మభూషణ్‌తో పాటు ఎన్నో జాతీయ అవార్డులు సొంతం చేసుకున్నారని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా బాలు కుటుంబ సభ్యులకు, మిత్రులకు రాష్ట్రపతి సానుభూతి తెలియచేశారు.

Related Posts