నక్సలైట్స్ లో కలిసిపోతా: ఏపీ దళితుడి లేఖకు స్పందించిన రాష్ట్రపతి.. కీలక ఆదేశాలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

నాకు జరిగిన అన్యాయానికి న్యాయం జరగటంలేదనీ..ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నాననీ సమాజంలో నాకు న్యాయం జరగనందుకు నేను నక్సలైట్లకు వెళ్లేందుకు నాకు అనుమతి ఇవ్వండి సార్..అంటూ ఏపీలోని దళిత యువకుడు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు రాసి లేఖపై ప్రెసిడెంట్ స్పందించారు. దీనికి సంబంధించి రాష్ట్రపతి కీలక ఆదేశాలు జారీ చేశారు.

అసిస్టెంట్‌ సెక్రటరీ జనార్ధన్‌బాబును కలవాలని, కేసు విషయంలో ఆయనకు సహకరించాలని బాధితుడు ప్రసాద్‌కు రాష్ట్రపతి కార్యాలయం సూచించింది. దీంతో త్వరలో పూర్తి ఆధారాలతో బాధితుడు జనార్ధన్‌బాబును కలవనున్నారు.ఏపీలో దళిత యువకుడికి పోలీసులు శిరోముండనం చేసిన కేసుపై రాష్ట్రవ్యాప్తంగా సంచలన కలిగింది. దీనిపై తనకు న్యాయం జరగటంలేదని బాధితుడు వెదుళ్లపల్లి శ్రీనివాసరావు కేసు పెను సంచలన కలిగిన విషయం తెలిసిందే.

వివరాల్లోకి వెళితే..ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా సీతానగరంలో వెదుళపల్లిలో ప్రసాద్‌ అనే ఎస్సీ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. తనను తీవ్రంగా కొట్టడంతో పాటు పోలీస్‌ స్టేషన్‌లోనే శిరోముండనం చేశారని బాధిత యువకుడు వాపోయారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

అయితే ఈ దారుణానికి పాల్పడిన ఎస్సైను సస్పెండ్ చేస్తున్నట్లు పోలీసు శాఖ ప్రకటించింది. కానీ, ఈ ఘటనకు కారణమైన అధికారపార్టీ నాయకులపై ఎటులాంటి చర్యలు తీసుకోలేదని బాధితుడు వాపోయాడు. స్థానికంగా అధికార పార్టీ నాయకులు తనను ఇప్పటికీ తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని భావోద్వేగం చెందాడు.

రాష్ట్రంలో ఇక తనకు న్యాయం జరగదని భావించి నక్సలైట్లలో కలిసిపోయి, తనను తీవ్రంగా అవమానించిన వారిపై ప్రతికారం తీర్చుకోవాలని భావిస్తున్నట్లు బాధిత యువకుడు ఇటీవలే సంచలన వీడియో విడుదల చేశారు. తాను నక్సలైట్లలో కలిసి పోయేందుకు అనుమతివ్వాలని రాష్ట్రపతిని కోరుతూ.. రాష్ట్రపతి కార్యాలయానికి బాధిత యువకుడు ఓ లేఖ కూడా రాశాడు. ఈ లేఖపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ స్పందించారు. ఆ యువకుడికి అండగా నిలబడేందుకు ప్రత్యేక అధికారిని నియమిస్తున్నట్లు తెలిపారు.

అసిస్టెంట్‌ సెక్రటరీ జనార్ధన్‌బాబును కలవాలని, కేసు విషయంలో ఆయనకు సహకరించాలని బాధితుడు ప్రసాద్‌కు రాష్ట్రపతి కార్యాలయం సూచించింది. దీంతో త్వరలో పూర్తి ఆధారాలతో బాధితుడు జనార్ధన్‌బాబును కలవనున్నడు బాధితుడు వెదుళ్లపల్లి వరప్రసాద్.

Related Posts