లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story-2

3వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం

Published

on

ఇటీవల పార్లమెంటు ఆమోదం పొందిన మూడు వివాదాస్పద వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదివారం ఆమోదం తెలిపారు. ఒకవైపు రైతులు, మరోవైపు ప్రతిపక్ష పార్టీలు నిరసన తెలిపినప్పటికీ ఈ బిల్లుల ఆమోదానికే ఆయన మొగ్గు చూపారు.


దీంతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా ఉభయ సభలు ఆమోదించిన నిత్యావసర సరుకుల సవరణ బిల్లు-2020, ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ ప్రమోషన్, ఫెసిలియేషన్ బిల్లు- 2020, ఫార్మర్స్ ఎంపవర్ మెంట్ అండ్ ప్రొటక్షన్, అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అస్యూరెన్స్ బిల్లు-2020 ఇక చట్టంగా మారిపోయాయి.


మరోవైపు, దేశ వ్యాప్తంగా రైతులు ఈ బిల్లులకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా హర్యానా,పంజాబ్,రాజస్థాన్ రాష్ట్రాల్లో రైతులు పెద్దఎత్తున నిరసనలు కొనసాగిస్తున్నారు. కాగా, వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ప్రభుత్వంలో భాగమైన శిరోమణి అకాలీదళ్ ఎన్డీయే నుంచి వైదొలగుతున్నట్లు శనివారం ప్రకటించింది. ఆ పార్టీకి చెందిన హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ ఇప్పటికే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *