ఆవిరితో కరోనాకు చెక్ పెట్టండి!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనా వైరస్ కు చెక్ పెట్టాలంటే..ఆవిరితో సాధ్యమంటున్నారు వైద్య నిపుణులు. దివ్య ఔషధంగా పనిచేస్తోందని ముంబైలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రి వెల్లడించింది. ఈ అలవాటు కరోనా చికిత్సలో అద్బుతంగా పనిచేస్తోందని, తాము చేసిన పరిశోధనలో సత్ఫలితాలు ఇచ్చినట్లు తెలిపారు.ఆవిరి పట్టడం వల్ల..ఎలాంటి వ్యాధి లక్షణాలు లేని వ్యక్తులు పాజిటివ్ వ్యక్తులు ఏడు రోజుల్లో, లక్షణాలున్న వారు ఏడు నుంచి 10 రోజుల్లో కోలుకున్నారని వీరి అధ్యయనంలో వెల్లడైంది. డాక్టర్ దిలీప్ పవార్ ఆధ్వర్యంలో మే, జూన్ నెలల్లో కరోనా సోకిన వారిపై ఈ స్టడీ చేశారు. ఆవిరిలో 70 నుంచి 80 డిగ్రీల టెంపరేచర్ ఉంటుందని, దీనివల్ల ఊపిరితిత్తుల్లో భారం తగ్గుతుందని, 50 నుంచి 60 డిగ్రీల టెంపరేచర్ తగలగానే వైరస్ చనిపోతుందన్నారు.

సాధారణంగా జలుబు రాగానే..పెద్దలు ఆవిరి పట్టుకోరా..అంటుంటారు. జిందా తిలస్మాత్, పసుపు, అమృతాంజన్‌ వేసి ఆవిరి పట్టుకుంటుంటారు. ప్రస్తుతం కరోనా టైంలో ఇది చక్కగా ఉపయోగపడుతుందని వైద్యులు సూచిస్తున్నారు. సాధారణ, మధ్యస్థ, లక్షణాలున్న వారు, వైరస్ సోకి ఎలాంటి లక్షణాలు లేని వ్యక్తులను రెండు గ్రూపులుగా విభజించి పరిశోధన నిర్వహించారు.ఫస్ట్ గ్రూప్ లో ఉన్నవారు రోజుకు రెండుసార్లు..5 నిమిషాల పాటు ఆవిరిపట్టేలా చర్యలు తీసుకుంటే..రెండో గ్రూప్ వారు ప్రతి 3 గంటలకు ఒకసారి 5 నిమిషాల పాటు ఆవిరి పట్టుకోవాలని సూచించారు. ఇలా 14 రోజుల నుంచి 2 నెలల పాటు పరిశీలిస్తే వీరిలో ఎలాంటి కరోనా లక్షణాలు లేవని, రెండు గ్రూపుల్లో ఉన్నవారిని పరిశీలిస్తే..స్వల్ప లక్షణాలున్న వారు 7 రోజుల్లో కోలుకుంటే..మధ్యస్థ లక్షణాలున్న వారు 7 నుంచి 10 రోజుల్లో కోలుకున్నారని తెలిపారు. శ్వాస వ్యవస్థలో ప్రాబ్లమ్స్ ఉంటే..ఆవిరి మంచి ఉపశమనమని వైద్యులు వెల్లడిస్తున్నారు.

Related Posts