లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమించిన ప్రధానికి రూ.13,000 జరిమానా

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ప్రపంచదేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. ఈ మహమ్మారి నుంచి బయటపడటమే లక్ష్యంగా ఆయా దేశాలన్నీ చర్యలు తీసుకుంటున్నాయి. కుదైలన తమ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు అవసరమైన చర్యలను దశల వారీగా తీసుకుంటూనే కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. భారత్ లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మంగళవారం (జూన్ 30, 2020) ప్రధాని మోడీ జాతినుద్ధేశించి ప్రసంగించారు. ఇందులో లాక్ డౌన్ నిబంధలను మరింత కఠినంగా అమలు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూనే నిబంధనలు అతిక్రమించిన ఓ దేశ ప్రధాని ఏకంగా రూ.13,000 జరిమానా కట్టారంటూ మోడీ ప్రస్తావించారు. దీంతో మోడీ చెప్పిన ఆ ప్రధాని ఎవరు? ఎందుకు జరిమానా కట్టాల్సి వచ్చింది? అనే చర్చ మొదలైంది.

బల్గేరియా…యారప్ ఖండంలోని ఓ దేశం. 69,48, 445 మంది జనాభా ఉన్న ఆ దేశంలో కూడా కరోనా వైరస్ వ్యాపించడంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. లాక్ డౌన్ విధించడంతోపాటు ప్రజలు మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడ తప్పనిసరి చేస్తూ కఠిన నిబంధనలను అమలు చేసింది. ఈ నిబంధనలను అతిక్రమించిన వారికి ఆరోగ్యశాఖ కఠిన శిక్షలు విధిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల ఆ దేశ ప్రధాని బోయ్కో బొరిస్సోవ్ కు ఆ దేశ ఆరోగ్యశాఖ అధికారులు 300 లెప్స్(రూ.13 వేలు) జరిమానా విధించారు.
బోయ్కో జారిస్సోవ్ ఇటీవల ఓ చర్చిని సందర్శించడానికి వెళ్లిన సమంలో ముఖానికి మాస్క్ ధరించలేదు. దీన్ని గుర్తించిన అధికారులు ఆయనకు భారీ జరిమానా విధించారు. ఆయన ఒక్కరికే కాదు..ప్రధాని వెంట వెళ్లిన కొందరు పాత్రికేయుులు, ఫొటోగ్రాఫర్లు, కెమెరామెన్లకు కూడా జరిమానా విధించారు.

బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించడంతో పాటు నిబంధనలు అమలు చేయడం ద్వారా కరోనాను బల్గేరియా ధీటుగా ఎదుర్కోకలిగింది. కేసులు తగ్గుముఖం పట్టడంతో లాక్ డౌన్ నిబంధనలను జూన్ నెలలోనే సడలించింది. అయితే గతవారం మాత్రం 606 కేసులు వచ్చాయి. దీంతో బల్గేరియాలో కేసుల సంఖ్య 3984కు చేరింది. 207 మరణాలు నమోదు అయ్యాయి.

తాజాగా కొత్త కేసులు నమోదు కావడంతో అప్రమత్తమైన అక్కడి ప్రభుత్వం బస్సులు, రైళ్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి చేసింది. ఇటీవల అధికార గెర్బ్, ప్రతిపక్ష సోషలిస్టుపార్టీలు భారీ సమావేశాలు నిర్వహించి భౌతికదూరం నిబంధనలను అతిక్రమిచడంతో రెండు పార్టీలకు చెరో 3000 లెప్ లు (రూ.1,30,228) చొప్పున జరిమానా విధించినట్లు అక్కడి అధికారులు చెప్పారు.