లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

గుజరాత్ లో ‘ఆరోగ్య వన్’ ప్రారంభించిన మోడీ

Published

on

modi inaugurates ‘Arogya Van’ in Kevadia గుజరాత్​లోని నర్మదా జిల్లాలో ఔషధ మొక్కల వనమైన ‘ఆరోగ్య వన్’ను ప్రధాని ప్రారంభించారు. ఐక్యతా విగ్రహానికి సమీపంలోని కేవడియా గ్రామంలో ఏర్పాటు చేసిన ఔషధ మొక్కలు, మూలికల వనాన్ని శుక్రవారం(అక్టోబర్-30,2020) ప్రారంభించిన అనంతరం ఓ బ్యాక్టరీ ఆటోలో కూర్చొని ఆ వనంలో మోడీ విహరించారు. మోడీ వెంట గుజరాత్ గవర్నర్ దేవ్​రథ్​, ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. మార్చి నెలలో కరోనా వైరస్ వ్యాప్తి మొదలైనప్పటినుంచి… మోడీ తన సొంత రాష్ట్రంలో పర్యటించడం ఇదే తొలిసారి.17 ఏకరాల విస్తీర్ణంలో ఉన్న ఆరోగ్య వన్ ​లో మానవాళి ఆరోగ్యానికి అవసరమైన ఔషధ మొక్కలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ వనంలో ఎంపిక చేసిన 380 జాతుల మొక్కలను పెంచినట్లు తెలిపారు. మొక్కల ప్రత్యేకత, ఔషధ గుణాలను తెలుసుకునేందుకు వీలుగా వాటికి సంబంధించిన వివరాలను బోర్డులపై రాసి సందర్శకులకు అందుబాటులో ఉంచినట్లు వివరించారు.ఆరోగ్య వన్​లో లోటస్ పాండ్, యోగా కేంద్రం, ఇండోర ప్లాంట్ విభాగం, అల్బా గార్డెన్, డిజిటల్ ఇన్ఫర్మెషన్ వంటివి ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా హస్తకళావస్తువులను ప్రోత్పహించడంలో భాగంగా కేవాడియాలో ఏర్పాటుచేసిన ఏక్ తా మాల్ మరియు చిల్డ్రన్ న్యూటిష్రన్ పార్క్ ను మోడీ ప్రారంభించారు.మరోవైపు,అక్టోబర్-31న సర్థార్ వల్లభాయ్ పటేల్ జయంతి నేపథ్యంలో ఇవాళ రాత్రికి కేవాడియాలోనే బస చేయనున్న ప్రధాని.. శనివారం ఐక్యతా విగ్రహం వద్ద సర్థార్ వల్లభాయ్ పటేల్ కి నివాళులర్పిస్తారు. కాగా, రెండు రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా ఇవాళ ఉదయం అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న మోడీ…అక్కడి నుంచి నేరుగా గాంధీనగర్ లోని శుక్రవారం కన్నుమూసిన గుజరాత్ మాజీ సీఎం కేశూభాయ్ పటేల్ నివాసానికి వెళ్లి…బాధిత కుటుంబసభ్యులను ఓదార్చారు. కేశూభాయ్ తో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అనంతరం,ఇటీవల మరణించిన గుజరాత్ సినీ దిగ్గజాలు కనోడియా బ్రదర్స్ కుటుంబసభ్యులను కలిశారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *