Home » ఒకే దేశం..ఒకే ఎన్నిక దేశానికి ఎంతో అవసరం : ప్రధాని మోడీ
Published
2 months agoon
By
bheemrajPM Modi reacted Jamili Elections : జమిలీ ఎన్నికలపై ప్రధాని మోడీ మరోసారి స్పందించారు. ఒకే దేశం..ఒకే ఎన్నిక దేశానికి ఎంతో అవసరం అన్నారు. దేశంలో ఎప్పుడూ ఎక్కడో ఒక చోట ఎన్నికలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇదంతా అభివృద్ధిపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. ఈ అంశంపై కూలంకషంగా అధ్యయనం చేయాలన్నారు.
ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ 80వ సమావేశాల సందర్భంగా ప్రధాని మోడీ వర్చువల్ సందేశం ఇచ్చారు. ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించడం భారత్‌కు అవసరమని అన్నారు. జమిలి ఎన్నికల అంశంపై కేవలం చర్చ మాత్రమే కుదరదని, ఇప్పుడు ఆ విధానం భారత్‌కు ఎంతో అవసరమని పేర్కొన్నారు.
మహనీయుల సమాధులు కూల్చాలనడం ఎంఐఎం అహంకారానికి నిదర్శనం : కేంద్ర సహాయమంత్రి కిషన్ రెడ్డి
ప్రతి కొన్ని నెలలకు ఒకసారి ఏదో ఒక ప్రదేశంలో ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. ఆ ఎన్నికల ప్రభావం అభివృద్ధి పనులపై ఎటువంటి ప్రభావం చూపుతుందో తెలుసు అని చెప్పారు. ఈ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని, దానికి ప్రిసైడింగ్ ఆఫీసర్లే మార్గదర్శకులవుతారని తెలిపారు.
మన రాజ్యాంగంలో ఎన్నో అంశాలు ఉన్నాయని, అయితే విధులు నిర్వర్తించడమే కీలకమైన అంశమన్నారు. విధుల నిర్వహణపై మహాత్మా గాంధీ చాలా ప్రత్యేకమైన దృష్టి పెట్టారని, హక్కులు-విధుల మధ్య సన్నిహిత సంబంధం ఉందని గాంధీ గుర్తించారని తెలిపారు. మనం మన విధులను నిర్వర్తిస్తే, అప్పుడు మన హక్కులు ఆటోమెటిక్‌గా రక్షింపబడుతాయని చెప్పారు.