Prime Minister modi meeting with cms once again, review on corona, lock down

మరోసారి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని సమావేశం.. కరోనా, లాక్‌డౌన్‌పై సమీక్ష

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య 3 లక్షలకు చేరుకోవడంతో తాజాగా భారత్ బ్రిటన్‌ను కూడా‌ బీట్‌ చేసి నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఇదే ధోరణి కొనసాగితే కొద్ది రోజుల్లోనే భారత్ మొదటి స్థానాన్ని ఆక్రమిస్తుందనే ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ మరోసారి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కరోనా, లాక్‌డౌన్‌ పరిస్థితులపై సమీక్ష నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. 

రెండు రోజులపాటు ప్రధాని సీఎంలతో వర్చువల్‌ సమావేశాల్లో పాల్గొంటారని పీఎం కార్యాలయం శుక్రవారం తెలిపింది. జూన్ 16, 17 వ తేదీల్లో ఈ వీడియో కాన్ఫరెన్స్‌లు ఉంటాయని వెల్లడించింది. కరోనా ప్రస్తుత పరిస్థితిని అంచనా వేయడంతోపాటు వైరస్‌ కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముఖ్యమంత్రులతో ప్రధాని చర్చించనున్నట్టు తెలుస్తోంది. మరోసారి లాక్‌డౌన్‌ విధించాలా అన్న విషయాలపై చర్చించే అవకాశం ఉంది. 

దేశవ్యాప్తంగా 3 లక్షల కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా ప్రపంచంలో నాలుగో స్థానానికి చేరిన ఇండియాలో లాక్ డౌన్ 1 తర్వాతే కేసులు పెరుగుతున్నాయి. శుక్రవారం 2,903 కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్ లో మొత్తం 3 లక్షల 4వేల 19కి చేరుకుంది. ఇందులో మహారాష్ట్రదే మెజార్టీ. లక్షా ఒక వెయ్యి 141కేసులతో అత్యధిక కేసులు ఉంటే తర్వాత రెండు స్థానాల్లో తమిళనాడు 40వేల 698, ఢిల్లీ 34వేల 687ఉన్నాయి. 

మహారాష్ట్రలో కేసులు శుక్రవారంతో లక్ష దాటేశాయి. కొత్తగా 3వేల 717నమోదు కాగా అందులో 127మంది చనిపోయారు. ముంబైలో వెయ్యి 366కేసులు నమోదుకాగా 90మంది చనిపోయారు. ముంబైలో రికవరీ రేటు 47.3శాతంగా ఉంది. ఈ మేర మహారాష్ట్ర రెమెడెసివర్ డ్రగ్ ట్రయల్స్ స్టార్ చేసేసింది. 

Related Tags :

Related Posts :