50 శాతం బెడ్స్ ప్రభుత్వానికి ఇచ్చేందుకు అంగీకరించిన ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

దోపిడీపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో 50 శాతం బెడ్స్ ప్రభుత్వానికి అందించేందుకు ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు అంగీకరించాయి. ప్రత్యేక యాప్ ద్వారా ప్రైవేట్ ఆస్పత్రులకు పేషెంట్లను వైద్య ఆరోగ్యశాఖ పంపించేందుకు ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు అంగీకరించాయి. రేపు అధికారులుు విధివిధానాలను ఖరారు చేయనున్నారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులతో ఇవాళ మంత్రి ఈటల రాజేందర్ సమావేశం అయ్యారు.

తెలంగాణలో రోజురోజుకు అంతకంతకు పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ప్రైవేట్ హస్పిటళ్ల దోపిడీ బాగా ఎక్కువగా అవుతుంది. ఇప్పటికే ప్రభుత్వానికి దాదాపు 1,039 ఫిర్యాదులు అందినట్లుగా అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రవేట్ హస్పిటళ్లు తమ తీరు మార్చుకోకపోతే ఊరుకునేది లేదని ప్రభుత్వం హెచ్చరించింది. కొన్ని హాస్పిటళ్లు ఇష్టారాజ్యంగా విపరీతంగా డబ్బులు వసూలు చేస్తూ కరోనా బాధితుల్ని పీడిస్తున్నాయని ఆరోపణలు రావడంతో ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు హాస్పిటళ్లు వ్యవహరించే తీరును ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తున్నారు.

కోవిడ్ చికిత్సలు అందిస్తున్న ప్రైవేటు హాస్పిటళ్లు, సూపర్ స్పెషాలిటీ హస్పిటళ్ల అసోసియేషన్ తో గురువారం ప్రభుత్వం సమావేశం అయింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ప్రైవేట్ హాస్పిటళ్లు అడ్డగోలుగా డబ్బులు వసూళ్లు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వానికి 50 శాతం బెడ్లు ఇవ్వాలని కోరారు.

ఈ నేపథ్యంలో ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు అన్ని కూడా 50 శాతం బెడ్స్ ను ప్రభుత్వానికి అందించేందుకు అంగీకరించాయి. ఈ నేపథ్యంలోనే వారితో భేటి అయిన తర్వాత ఈ శుభవార్త ఆరోగ్య శాఖ వెల్లువరించింది.

Related Posts