లాక్‌డౌన్‌లో ఫీజులొద్దనేసరికి…. ఆన్‌లైన్ క్లాసులను రద్దుచేసుకున్న ప్రైవేట్ స్కూల్స్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

లాక్ డౌన్ సమయంలో విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయొద్దంటూ ప్రభుత్వాలు ప్రైవేటు స్కూల్ యజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశాయి. అప్పటినుంచి విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రైవేటు స్కూళ్ల మధ్య ఫీజుల వివాదానికి దారితీసింది. ప్రత్యేకించి గుజరాత్‌లో పరిస్థితి అద్వాన్నంగా కనిపిస్తోంది.

COVID-19 లాక్‌డౌన్ వ్యవధిలో ప్రైవేట్ పాఠశాలలు ఫీజు వసూలు చేయరాదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటనతో రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలలు ఆన్‌లైన్ క్లాసులను కూడా నిలిపివేయాలని నిర్ణయించాయి. ప్రభుత్వ తీర్మానం (GR) ప్రకటించిన తరువాత, ప్రైవేట్ పాఠశాలల సంఘాలు ఒక సమావేశాన్ని నిర్వహించాయి. అన్ని విద్యా, అడ్మినిస్ట్రేషన్ వర్క్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి.

ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. లాక్ డౌన్ సమయంలో ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ప్రైవేట్ పాఠశాలలు ట్యూషన్ ఫీజు వసూలు చేయకుండా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు గుజరాత్ హైకోర్టులో (PIL) దాఖలు చేశాయి.

ఈ ప్రభుత్వ తీర్మానాన్ని (GR) ప్రభుత్వ అభిప్రాయంగా హైకోర్టులో అఫిడవిట్‌గా సమర్పించింది. తదుపరి విచారణ జూలై 24న జరుగనుంది. కొన్ని చోట్ల 50 శాతం వేతనమే ఉపాధ్యాయులు తీసుకుంటున్నారు. 7.5 లక్షల మంది ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది జీవనోపాధి ప్రశ్నార్థకంగా మారింది.

Related Posts