లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Uncategorized

డ్రంకెన్ డ్రైవర్లు : విజయవాడ హైవేపై డ్రంక్ అండ్ డ్రైవ్

Published

on

Private Travels Bus Drivers Caught Drunk Drive

తెలుగు రాష్ట్రాల్లో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. పదుల సంఖ్యలో ప్రయాణికులు కన్నుమూస్తున్నారు. కళ్ల ముందే జనం ప్రాణాలు పోతున్నా… ప్రైవేట్‌ ట్రావెల్స్ మాత్రం బుద్ధి మార్చుకోవడం లేదు. ప్రైవేట్‌ ట్రావెల్స్ డ్రైవర్లు ఫుల్‌గా మందుకొట్టి వాహనాలు నడుపుతున్నారు. కృష్ణా జిల్లా నందిగామ పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్‌ తనిఖీల్లో ముగ్గురు డ్రైవర్లు మద్యం సేవించి పట్టుబడ్డారు.

హైదరాబాద్‌- విజయవాడి హైవేపై… ఇటీవల ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. దీంతో మే 14వ తేదీ అర్ధరాత్రి నందిగామ డీఎస్పీ ఆధర్వంలో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. బ్రీత్ అనలైజర్‌తో పరీక్షలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మూడు ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సు డ్రైవర్లు మద్యం సేవించి దొరికిపోయారు. శ్రీ వెంకట పద్మావతి… జీవీఆర్‌ ట్రావెల్స్.. శ్రీ కనకదుర్గ ట్రావెల్స్‌కు చెందిన  ముగ్గురు డ్రైవర్లు ఫుల్‌గా మందుకొట్టి బ్రీత్‌ అనలైజర్‌ టెస్టులో పట్టుబడ్డారు. వీరిని అదుపులోకి తీసుకున్న నందిగామ పోలీసులు… కేసులు నమోదు చేశారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *