లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

లిప్ లాక్ సీన్స్ సక్సెస్ ఇవ్వవు – నిర్మాత రాజ్ కందుకూరి

‘చూసీ చూడంగానే’ నిర్మాత రాజ్ కందుకూరి సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు..

Published

on

Producer Raj Kandukuri About Chusi Chudangaane Movie

‘చూసీ చూడంగానే’ నిర్మాత రాజ్ కందుకూరి సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు..

‘పెళ్ళిచూపులు’, ‘మెంట‌ల్ మ‌దిలో’ వంటి చిత్రాల‌ను నిర్మించి స‌క్సెస్‌ఫుల్ నిర్మాత‌గా జాతీయ అవార్డ్‌, ఫిలింఫేర్ అవార్డుల‌ను సొంతం చేసుకున్నారు నిర్మాత రాజ్ కందుకూరి. ప్ర‌స్తుతం రాజ్ కందుకూరి నిర్మాత‌గా ధ‌ర్మ‌ప‌థ క్రియేష‌న్స్ ప‌తాకంపై ఆయ‌న త‌న‌యుడు శివ కందుకూరి హీరోగా ప‌రిచ‌యం చేస్తూ నిర్మించిన చిత్రం ‘చూసీ చూడంగానే’. శేష సింధు ద‌ర్శకురాలు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ద్వారా జనవరి 31న గ్రాండ్‌గా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా నిర్మాత రాజ్ కందుకూరి సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు..

ఎన్ని అవార్డ్స్ ఇచ్చినా దానికి సరితూగదు!
నేను ఇప్పటివరకూ నా సినిమాల ద్వారా చాలా మంది కమెడియన్స్‌తో పాటు టెక్నీషియన్స్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేశాను, ఈ విషయం నేను ఈ రోజు గర్వంగా చెప్పుకోగలను. ఏ షూటింగ్‌కి వెళ్ళినా అక్కడ నా సినిమాల ద్వారా పరిచయం అయిన వాళ్ళు కనీసం ఒక్కరు ఇద్దరైనా ఉంటున్నారు. వాళ్ళు నా మీద చూపించే ప్రేమ నాకు ఎన్ని అవార్డ్స్ ఇచ్చినా ఆ ఆనందానికి సరితూగదు.
కొత్తవాళ్లే కావాలని!
మన దగ్గర లేడీ డైరెక్టర్స్‌ సంఖ్య చాలా తక్కువ. మా బేన‌ర్‌లో ఎలాగైనా ఒక‌ లేడీ డైరెక్టర్‌ని పరిచయం చేయాలనుకున్నాను. శేష సింధు చెప్పిన కథ నచ్చింది. ఆమెకు క్రిష్‌, సుకుమార్‌ల ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌ని చేసిన అనుభ‌వం ఉంది. కానీ నిన్ను నమ్మి సినిమా ఎలా ఇవ్వాలని అడిగాను. ఐదు నిమిషాల వీడియో షూట్‌ చేసి చూపించింది. దాంతో నమ్మకం వచ్చింది. ఈ సినిమాకు న‌టీన‌ట‌లు కూడా కొత్తవాళ్లే కావాలని అడిగింది.

Read Also : హాలీవుడ్‌కి హాయ్ చెప్పనున్నఅలీ

Image

శివ మంచి ఈజ్‌‌తో చేశాడు!
అప్పుడే మా అబ్బాయి ఇండియా వచ్చాడు. తనని సుమారు 12 రోజులు ఆడిషన్‌ చేసి హీరోగా తీసుకుంది. మా అబ్బాయి సినిమా అని స్పెషల్‌గా ఏం చేయలేదు. కథకు ఏం కావాలో అదే చేశాం. సినిమా కంటెంట్ అందరికీ నచ్చుతుంది. విద్యార్థుల హృదయాల్ని తాకే మంచి సబ్జెక్ట్. ఇది ఒక కామన్ బాయ్ కథ ఇప్పటికే చాలా మంది విద్యార్థులు ట్రైలర్‌కి, పాటలకి కనెక్ట్ అయ్యారు. దాంతో ఈ సినిమా విజయంపై నమ్మకం కలిగింది.
మూడు చిత్రాల్లో అవకాశం!
మా అబ్బాయి కోసం ఓ పెద్ద దర్శకుడినే తీసుకురావొచ్చు. కానీ అది నాకు ఇష్టం లేదు. ఓ సామాన్యుడిగానే తను తెరకు పరిచయమవ్వాలి. ఆ సినిమా చూశాక మంచి ఈజ్‌‌తో చేశాడు. నటుడిగా తనకంటూ ఓ స్థానం ఏర్పరచుకుంటాడని ఓ తండ్రిగా నమ్మకం కలిగింది. తొలి సినిమా ఇంకా బయటకు రాకుండానే మూడు చిత్రాల్లో అవకాశం దక్కించుకున్నాడు. తను నటించిన మరో సినిమా మార్చిలో విడుదలవుతుంది.

Image

క్రిస్పీగా ఉండేలా ఎడిట్ చేశాం!
మా బ్యానర్‌లో వచ్చే సినిమాల్లో అశ్లీలత, డబుల్‌ మీనింగ్‌ డైలాగ్స్‌ ఉండవు. నా సినిమాల్లో హీరోయిన్‌ పాత్రలు బలంగా ఉండాలనుకుంటాను. ఈ సినిమా కూడా క్రిస్పీగా ఉండేలా సురేష్ బాబు గారి స‌ల‌హా మేర‌కు 1:54 నిమిషాల నిడివి ఉండేలా ఎడిట్ చేశాం. నిర్మాతగా ఒక మంచి సినిమా తీశాన‌నే సంతృప్తి ఉంది.
లిప్‌లాక్‌ సన్నివేశాలు సక్సెస్‌ ఇవ్వవు!
సరైన సినిమా తీయడానికి 50 కోట్లు అక్కర్లేదు. 3 కోట్లు చాలు. 50 కోట్ల సినిమా తీయడం కంటే చిన్న బడ్జెట్‌ సినిమాలు తీయడమే ఎక్కువ రిస్క్‌. ఆ రిస్క్‌ అంటే నాకు ఇష్టం. ఈ మధ్య లిప్‌లాక్స్‌ సన్నివేశాలు ఉంటేనే సినిమా హిట్‌ అవుతుంది అనుకుంటున్నారు. లిప్‌లాక్‌ సన్నివేశాలు సక్సెస్‌ ఇవ్వవు.
ప్రతి సంవత్సరం ఒక సినిమా!
ఇక నుండి మా బేన‌ర్‌లో ప్రతి సంవత్సరం ఒక సినిమా వ‌చ్చేలా ప్లాన్ చేస్తున్నాం. మా బేన‌ర్‌లో తరువాత సినిమా ఏప్రిల్ నుండి మొదలవుతుంది.. అని చెప్పారు నిర్మాత రాజ్ కందుకూరి..

  
                                                     
                                                   

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *