లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

వ్యభిచార గృహంపై పోలీసుల దాడి, ముగ్గురి అరెస్ట్

Published

on

Prostitution racket busted in Machilipatnam :కృష్ణాజిల్లా మచిలీపట్నంలో జనావాసాల మధ్య నిర్వహిస్తున్న వ్యభిచార గృహం పై పోలీసులు దాడి చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు. చిలకలపూడి పోలీసు స్టేషన్ పరిధిలోని శిడింబి అగ్రహారంలోని ఓ ఇంటిని అద్దెకు తీసుకుని మహిళ ఈ వ్యాపారం నిర్వహిస్తోంది. ఇతర ప్రాంతాల మనుంచి అమ్మాయిలను తీసుకువచ్చి గుట్టుగావ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇటీవలి కాలంలో ఆ ఇంటికి యువకులు వచ్చిపోవటం ఎక్కువ అవటంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు శుక్రవారం రాత్రి ఇంటిపై దాడి చేసి ఒక నిర్వాహకురాలితో పాటు, మరో యువతి, విటుడిని అరెస్ట్ చేశారు. సెక్స్ వర్కర్ ను ప్రభుత్వ వసతి గృహానికి తరలించారు. విటుడు,నిర్వాహకురాలిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.