గంటా మాకొద్దు అంటూ భీమిలీలో వైసీపీ నిరసనలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

టీడీపీ నేత..మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరబోతున్నారనే వార్తలు హల్ చల్ చేస్తున్న క్రమంలో గంటా వైసీపీలో చేరడాన్ని మంత్రి అవంతి శ్రీనివాసరావు వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అవంతి కూడా గంటాపై ఫైర్అవుతున్నారు. పదవులు ఎక్కడ ఉంటే అక్కడ గంటా చేరిపోతారని విమర్శిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంపై గంటాకు ప్రేమ ఉండి పార్టీలో చేరతానని అనటం లేదనీ ఆయనమీద ఉండే కేసులు మాఫీ చేయించుకోవటానికేనంటూ చురకలు అంటించారు అవంతి. అధికారం లేకపోతే గంటా ఉండలేరని, సైకిళ్లు, భూ కుంభకోణాల్లో గంటా.. ఆయన అనుచరులు ఉన్నారని..ఆ కేసులు మాఫీ కోసం పార్టీలో చేరతానని అంటున్నారని గంటా చేరికతో పార్టీకి నష్టం జరుగుతుందని అవంతి ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.ఈ క్రమంలో గంటా రాకతో విశాఖ వైసీపీలో ఆగ్రహ జ్వాలలు రేగుతున్నాయి. గంటా రాకను స్థానిక వైసీపీ ప్రముఖులు వ్యతిరేకిస్తున్నారు. ఈక్రమంలో మిలి నియోజకర్గంలో గంటాకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కూడా వెలిశాయి. గంటా మాకొద్దు అంటూ నిరసనకారులు నినాదాలు చేస్తున్నారు. జగన్ పాదయాత్ర చేస్తున్న సమయంలో వైయస్సార్ విగ్రహాన్ని గంటా తొలగించారని… అటువంటి వ్యక్తిని ఇప్పుడు పార్టీలోకి ఎలా వస్తారని ప్రశ్నిస్తున్నారు. గంటాను పార్టీలోకి తీసుకోవద్దని జగన్ ను కోరుతున్నారు. మరోవైపు గంటా వైసీపీలో చేరితే… విశాఖ వైసీపీలో ఆధిపత్య పోరు తీవ్ర స్థాయికి చేరిందని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Related Posts