Psycho is slated for a worldwide release on December 27

‘సైకో’ డిసెంబర్ 27న రానున్నాడు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఉదయనిధి స్టాలిన్, అదితి రావు హైదరీ, నిత్యా మీనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘సైకో’ డిసెంబర్ 27 విడుదల..

ఉదయనిధి స్టాలిన్, అదితి రావు హైదరీ, నిత్యా మీనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తమిళ సినిమా ‘సైకో’.. డబుల్ మీనింగ్ ప్రొడక్షన్ బ్యానర్‌పై.. ‘ముగమూడి’ (మాస్క్), ‘తుప్పారివాలన్’ (డిటెక్టివ్) సినిమాలతో ఆకట్టుకున్న మిస్కిన్ ఈ సినిమాకు దర్శకుడు.. 

సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ‘సైకో’ టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. థియేటర్లో ప్రేక్షకులు కుర్చీ అంచున కూర్చుని చూసేలా థ్రిల్ కలిగిస్తుందని దర్శక, నిర్మాతలు చెబుతున్నారు.

Read Also : అక్షయ్ కుమార్ ‘బెల్ బాటమ్’ – ఫస్ట్‌లుక్

ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. డిసెంబర్ 27న ‘సైకో’ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. సింగంపులి, రామ్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సంగీతం : మ్యాస్ట్రో ఇళయరాజా, కెమెరా : తన్వీర్ మీర్, ఎడిటింగ్ : ఎ. అరుణ్ కుమార్.
 

Related Posts