పబ్​జీ సహా 118 చైనా యాప్స్ బ్యాన్​ చేసిన కేంద్రం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

PUBG Banned: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది.  పబ్​జీ మొబైల్ సహా 118 చైనా యాప్స్​ను నిషేధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దేశ భద్రత, సార్వభౌమత్వానికి ముప్పు వాటిల్లుతుందనే కారణంతో ఈ మేరకు చర్యలకు ఉపక్రమించింది.

యువతలో హింసాత్మక ప్రవృత్తిని పెంచిపోషిస్తున్న పబ్ జీని దేశంలో బ్యాన్ చేయాలని కొంతకాలంగా పలువురు మేధావులు,విద్యార్థుల తల్లిదండ్రుల డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పబ్ జీ ని బ్యాన్ చేస్తూ ఇవాళ మోడీ సర్కార్ నిర్ణయం తీసుకుంది.

కాగా, గాల్వాన్ ఘటన తర్వాత భారతదేశంలో యాంటీ చైనా సెంటిమెంట్ తెరపైకి వచ్చింది. దీంతో జూన్ లోటిక్ టాక్ సహా 59 చైనా యాప్స్‌ను కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేయడం తెలిసిందే. నిషేదిత చైనా యాప్స్ జాబితాలో ఇప్పుడు పబ్​జీ కూడా చేరింది.

చైనా యాప్స్‌ని బ్యాన్ చేయడం ద్వారా డ్రాగన్ దేశం ఆర్థిక మూలాలు కదులుతున్నాయని..చైనాకు భారత్ సరైన సమాధానమిచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పబ్ జీ సహా కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసిన చైనీస్ యాప్స్ ఇవే

 

Related Posts