లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

india

పబ్ జీ మొబైల్ ఇండియాలో లాంచింగ్ డేట్ ఎప్పుడో తెలుసా..

Published

on

PUBG Mobile India: ఇండియాలోకి మరోసారి గవర్నమెంట్ అప్రూవల్ తో అడుగుపెట్టేందుకు రెడీ అయిపోయింది పబ్ జీ. మిలియన్ల కొద్దీ అభిమానుల కోసం చివరి అవకాశం ఇచ్చింది ప్రభుత్వం. పాపులర్ బ్యాటిల్ రాయల్ గేమ్ పబ్ జీ మొబైల్ సస్పెన్స్ కు తెరలేపి ఇండియాలోకి అధికారికంగా లాంచ్ అవనున్నట్లు వెల్లడించారు.

జనవరి రెండో వారం లేదా మూడో వారం నాటికి అందరికీ అందుబాటులోకి వచ్చేస్తుందని రిపోర్టులు చెబుతున్నాయి. పరిస్థితులు అటూ ఇటు అయినప్పటికీ కచ్చితంగా మార్చి కంటే ముందే దీని లాంచింగ్ ఉంటుందని జీ మీడియా చెబుతుంది.

పబ్ జీ మొబైల్ డిసెంబర్ 2020లో రెండు పెద్ద అనౌన్స్‌మెంట్లు చేసింది. పబ్ జీ అభిమానులను పెంచుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ ప్లాన్లు చేసింది. పేరెంట్ కంపెనీ క్రాఫ్టన్ ఇన్క్ రీసెంట్ గా అనీశ్ అరవింద్ ను ఇండియాకు న్యూ కంట్రీ మేనేజర్ గా అపాయింట్ చేసింది. టీంలోకి మరో నలుగురిని యాడ్ చేసింది బోర్డు.

ఈ నలుగురు టెన్సెంట్ లో భాగంగా ఉన్న వారే. పబ్ జీ మొబైల్ గ్లోబల్ వర్షన్‌పై కంపెనీకు అన్ని రైట్స్ ఉంటాయి. జనవరి 26న లాంచ్ కానున్న FAU-G ఫియర్‌లెస్ అండ్ యునైటెడ్ గార్డ్స్ ను జనవరి 26నాటికి లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. గేమింగ్ మార్కెట్ లో చాలా వరకూ ఆక్యుపెన్సీ చేస్తుందనే ఆశాభావంతో ఉంది కంపెనీ.

ఇక దీని డేటా సెంటర్ కూడా ఇండియాలోనే ఉంటుంది. ఎందుకంటే ఇది మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్. పబ్ జీ మొబైల్ డేటా సెంటర్ మాత్రం విదేశాలకు లింక్ అయి ఉంటుంది. FAU-G ఫియర్‌లెస్ అండ్ యునైటెడ్ గార్డ్స్‌ను ఎన్‌కోర్ గేమ్స్ క్రియేట్ చేసింది.