-
Home » పబ్జీ మొబైల్ ఇండియా రీఎంట్రీ.. బ్యాన్ తర్వాత ఏయే ఫీచర్లతో వస్తోందో తెలుసా?
Latest
పబ్జీ మొబైల్ ఇండియా రీఎంట్రీ.. బ్యాన్ తర్వాత ఏయే ఫీచర్లతో వస్తోందో తెలుసా?
Published
1 month agoon

PUBG Mobile India Relaunch : పాపులర్ మొబైల్ గేమ్ మళ్లీ ఇండియాలోకి రీఎంట్రీ ఇస్తోంది. భారతదేశంలో లక్షలాది మంది పబ్జీ లవర్స్.. PUBG మొబైల్ ఇండియా యాప్ లాంచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. PUBG మొబైల్ ఇండియా జనవరి 15 నుంచి జనవరి 19 మధ్యలో రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పబ్ జీ మొబైల్ ఇండియా యాప్ లాంచ్ కు సంబంధించి ఒక టీజర్ వీడియో కూడా రిలీజ్ చేసింది కంపెనీ.
ఇండియాలో టెన్సెంట్ కంపెనీ యాప్ పబ్ జీ బ్యాన్ చేసిన తర్వాత పబ్ జీ మొబైల్ ఇండియా కొత్తగా రీఎంట్రీ ఇస్తోంది. సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకునేలా ఉంటాయని అంటున్నారు. అయితే మొబైల గేమ్ యాప్ ఫీచర్లలో ఏయే మార్పులతో వచ్చే అవకాశం ఉందో ఓసారి చూద్దాం..
స్పెషల్ కస్టమైజ్డ్ డిజైన్ :
పబ్ జీ మొబైల్ ఇండియా యాప్.. స్వదేశీ అవసరాలకు తగినట్టుగా ప్రత్యేకంగా కస్టమైజ్ చేశారంట.. సాధారణ మ్యాప్స్, క్యారెక్టర్లతో పాటు వర్చువల్ సిమ్యులేషన్ ట్రైనింగ్ గ్రౌండ్ సెట్టింగ్ ఉంటుంది. పాత గేమ్ లో రెడ్ ఎఫెక్ట్స్ ఉండేవి.. ఈ కొత్త గేమ్ యాప్ లో గ్రీన్ హిట్ ఎఫెక్ట్స్ ఉండనున్నాయి.
సమయ నిబంధనలు :
కొత్త పబ్ జీ మొబైల్ ఇండియా యాప్ లో టైం రిస్ట్రక్షన్స్ ఉండనున్నాయి. దీనికి సంబంధించి కంపెనీ ఇంకా రివీల్ చేయలేదు. కానీ, యూజర్లు ఎంతసేపు పబ్ జీ యాప్ వినియోగించాలి అనేదానిపై ఒక ఫీచర్ యాడ్ కానుంది. యంగర్ ప్లేయర్ పరిమితికి మించి పబ్ జీకి అడిక్ట్ కాకుండా ఉండేందుకు ఈ ఫీచర్ కంట్రోల్ చేయనుంది.
పాత పబ్జీ అకౌంట్ వాడొచ్చు :
గతంలో వాడిన ఓల్డ్ పబ్ జీ అకౌంట్ ఉందా? అయితే కొత్త పబ్ జీ యాప్ లోనూ యాక్సస్ చేసుకోవచ్చు. పబ్ జీ మొబైల్ ఇండియా సర్వర్లలోకి మైగ్రేట్ కావడంతో ద్వారా పాత పబ్ జీ అకౌంట్లలోని యూజర్ల పర్సనల్ డేటా మైగ్రేట్ అవుతుంది. కొత్త పబ్ జీ అకౌంట్ ను పాత పబ్ జీ అకౌంటుతో లింక్ చేసుకోవచ్చు. అంతేకాదు. పాత అకౌంట్లో కొనుగోలు చేసిన అన్ని వెపన్స్ కొత్త అకౌంట్లోకి మారిపోతాయి.
పబ్ జీ యూజర్ల డేటా ఇండియా సర్వర్లలోనే :
భారతీయ పబ్ జీ మొబైల్ గేమ్ యాప్ యూజర్ల పర్సనల్ డేటా మొత్తం ఇండియన్ పబ్ జీ సర్వర్లలోనే స్టోర్ అవుతుంది. మైక్రోసాఫ్ట్ Azure సర్వర్లలో స్థానికంగా హోస్టింగ్ అయి ఉంటుంది. అంతేకాదు.. పబ్ జీ యాప్ సర్వర్ల నిర్వహణ, భద్రతా ప్రమాణాలపై ఎప్పటికప్పుడూ రెగ్యులర్ గా అడిట్స్, వెరిఫికేషన్స్ జరుగుతూనే ఉంటాయి.
దేశంలో 10 కోట్ల పెట్టుబడితో పబ్జీ ఇండియా :
టెన్సెంట్ కంపెనీ పబ్ జీ మొబైల్ ఇండియా గేమ్ యాప్ కోసం భారతదేశంలో 100 మిలియన్లు (10 కోట్లు) పెట్టుబడులు పెట్టేందుకు హామీ ఇచ్చింది. గేమింగ్ సర్వీసును దేశంలో మరింత బలోపేతం చేసే దిశగా కంపెనీ పబ్ జీ మొబైల్ సర్వీసుల్లో అనేక మార్పులతో లాంచ్ చేస్తోంది.
ఇప్పటికీ పబ్ జీ ఆడొచ్చు :
పబ్ జీ మొబైల్ ఇంకా భారతదేశంలో రీలాంచ్ కాలేదు. అయినప్పటికీ పబ్ జీ గేమ్ ఆడొచ్చు అంట.. పబ్ జీ పీసీ, కన్సోల్ యాప్ ద్వారా ఇంకా పబ్ జీ యాప్ అందుబాటులోనే ఉంది. అలాగే ఉచితంగా పబ్ జీ ప్లే చేయొచ్చు. అయితే ఈ రెండు వెర్షన్ల కు సంబంధించి పెయిడ్స్ వెర్షన్లు ఉన్నాయి. ఈ వెర్షన్లను రూ.1,000లకు షెల్ చేసుకోవచ్చు.
పబ్ జీ మొబైల్ లైట్ వెర్షన్ వస్తుందా? :
మీరు పబ్ జీ మొబైల్ లైట్ వెర్షన్ యూజరా? అయితే మరికొంతకాలం మీరు వేచి చూడక తప్పదు. ప్రస్తుతానికి కంపెనీ పబ్ జీ మొబైల్ గేమ్ యాప్ మాత్రం రీలాంచ్ చేస్తోంది. ఇప్పటివరకూ మొబైల్ లైట్ వెర్షన్ పబ్ జీ లాంచ్ గురించి ఎలాంటి ప్లానింగ్ లేదు.
You may like
-
పబ్ జీ మొబైల్ ఇండియాలో లాంచింగ్ డేట్ ఎప్పుడో తెలుసా..
-
గేమర్లకు గుడ్ న్యూస్, PUBG వచ్చేస్తోంది!
-
PUBG Mobile Ban: దేశంలో ఇక రాదు.. కనపడదు..
-
మరో ప్రాణం తీసిన PUBG బ్యాన్, అనంతలో ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య, సెల్ఫోన్లో స్టేటస్ పెట్టి..
-
పబ్జి రీఎంట్రీ?: ఇండియాలో పబ్జీ కార్పొరేషన్ చేతుల్లోకి PUBG Mobile
-
PUBG Ban : డోంట్ వర్రీ.. ఇండియాలో PUBG ఆడొచ్చు.. ఎలానో తెలుసా?

జోరుగా కారు ప్రచారం.. రంగంలోకి కేటీఆర్, హరీష్ రావు

‘ఆహా’ లో నరేష్ ‘నాంది’

ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా టీకా రూ. 250కే!

మద్యం మత్తులో వాహనాలను ఢీ కొట్టిన యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్..

పెళ్లిళ్లో మద్యానికి నో చెప్పే వధువుకు నగదు బహుమతి

యాంకర్ మంజూష లేటెస్ట్ ఫొటోస్

‘ఇస్మార్ట్ బ్యూటీ’ నిధి అగర్వాల్ ఫొటోస్

ఐశ్వర్యా రాజ్ భకుని ఫొటోస్

నేచురల్ బ్యూటీ సుభిక్ష ఫొటోస్

సుకుమార్ ఫ్యామిలీ ఫంక్షన్లో స్టార్స్ సందడి!

బోధన్ అడ్రస్‌తో బంగ్లాదేశీయుల పాస్‌పోర్టులు

ఒక్కో ఫోన్ నెంబర్‌పై నాలుగు వాక్సినేషన్ రిజిస్ట్రేషన్లు

కారు టైరును స్వయంగా మార్చిన కలెక్టర్

అంతరిక్షయానంలో సరికొత్త ఇస్రో హిస్టరీ
