లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

పేషంట్ల కంప్లైంట్…కరోనా వార్డులో టాయిలెట్ కడిగిన ఆరోగ్య మంత్రి

Published

on

హాస్పిటల్ లోని కరోనా వార్డులో మరుగుదొడ్డి శుభ్రం చేశారు పుదుచ్చేరి ఆరోగ్య మంత్రి మల్లాడి కృష్ణారావు. ఎన్నికలొస్తే గానీ ప్రజల ఇబ్బందులు పట్టించుకోని రాజకీయ నాయకులున్న ఈ రోజుల్లో… కరోనా విజృంభిస్తోన్న వేళ పారిశుద్ధ్యం ప్రాముఖ్యతను తెలియజేసేందుకు స్వయంగా రంగంలోకి దిగి అసలైన లీడర్ అనిపించుకున్నారు పుదుచ్చేరి ఆరోగ్య మంత్రి.

శనివారం(ఆగస్టు-29,2020) పుదుచ్చేరి ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ హాస్పిటల్(IGGMCH) లో మంత్రి కృష్ణారావు పర్యటించారు. బాధితులను పరామర్శించిన ఆయన.. వసతులు ఎలా ఉన్నాయని ఆరా తీశారు. అయితే టాయిలెట్స్ శుభ్రంగా లేవని కొందరు పేషంట్లు మంత్రిగారికి కంప్లయింట్ చేశారు.

దీంతో మంత్రిగారే స్వయంగా రంగంలోకి దిగారు. క్లీనింగ్ బ్రష్​, లిక్విడ్ తో ఓ మరుగుదొడ్డి శుభ్రం చేశారు. ఇకపైనైనా పారిశుద్ధ్య కార్మికుల సాయంతో పరిసరాలు క్లీన్​ చేయించాలని యాజమాన్యాన్ని మందలించారు.మరుగుదొడ్లు ఉపయోగించాక నీళ్లతో శుభ్రం చేసేయాలని.. ఎవరో వచ్చి క్లీన్​ చేస్తారని వేచి చూడొద్దని కరోనా బాధితులకు మంత్రి సూచనలు చేశారు.

మరోవైపు, వారంలోగా డాక్టర్లు, నర్సులు పారిశుద్ధ్య కార్మికులు కలిపి మొత్తం 458 మంది ఆరోగ్య కార్యకర్తలను కాంట్రాక్టు పద్ధతిలో నియమించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ఆరోగ్య మంత్రి కృష్ణారావు తెలిపారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *