పునర్నవి.. ఇది పెళ్లా.. పబ్లిసిటీనా?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Punarnavi Engaged: ‘ఉయ్యాల జంపాల, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ వంటి పలు చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుని తర్వాత బిగ్‌‌బాస్ 3 కంటెస్టెంట్‌గా పాపులర్ అయిన పునర్నవి భూపాలం ఎంగేజ్ మెంట్ అయిపోయింది అనే వార్త రకరకాలుగా వినిపిస్తోంది. బుధవారం ఆమె నిశ్చితార్థపు ఉంగరం ఫొటోని చూపిస్తూ.. ‘ఫైనల్లీ ఇట్స్‌ హ్యాపెనింగ్‌’ అని పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.


నిశ్చితార్థపు ఉంగరం ఉన్న తన చేతిని వేరే చేయి పట్టుకుని ఉండటంతో.. ఆమెని పెళ్లి చేసుకోబోయే వారు ఎవరా? అని అంతా అనుకుంటుండగా.. ఆ సస్పెన్స్‌కు తెరదించింది పునర్నవి. తను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఫొటోని బ్లర్‌ చేసి అత‌ని పేరు ఉద్భ‌వ్ ర‌ఘునంద‌న్ అని.. మా గురించి మొత్తం మీకు రేపు తెలియజేస్తానని పేర్కొంది.


ఉద్భ‌వ్ ర‌ఘునంద‌న్ కూడా ఫైనల్లీ ఆమె అంగీకరించింది. రేపు (శుక్రవారం) మా జీవితంలో చాలా గొప్పరోజు అని తెలియజేసేందుకు సంతోషిస్తున్నాను.. అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడమే కాకుండా.. పునర్నవితో కలిసి ఉన్న ఫొటోని కూడా షేర్‌ చేశాడు. ఇదిలా ఉంటే.. వీరిద్దరూ కలిసి నటించిన ఓ వెబ్‌ సిరీస్‌ కోసం ఈ విధంగా ప్రమోషన్స్‌ స్టార్ట్ చేశారని.. పెళ్లి విషయంలో వీళ్లు చెబుతున్నది వాస్తవం కాదని, పునర్నవి చేతికి ఉన్న రింగ్‌ కుడిచేతికి ఉంది కాబట్టి ఇది పెళ్లి మ్యాటర్‌ కాదని, ప్రమోషన్‌ మ్యాటర్‌ అని అనే మాటలూ వినిపిస్తున్నాయి.

కాగా పునర్నవి సినిమాల కంటే.. బిగ్‌‌బాస్‌ ద్వారానే బాగా పాపులర్‌ అయ్యింది. అందులో బిగ్‌బాస్‌ 3 విన్నర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌తో ఆమె వ్యవహరించిన తీరు హాట్‌ టాపిక్‌ అయిన విషయం తెలిసిందే. బిగ్‌‌బాస్‌ నుంచి బయటికి వచ్చాక వారిద్దరూ పెళ్లి చేసుకుంటారని అంతా అనుకున్నారు. ఆమె వేరొకరితో ప్రేమలో ఉందని రాహుల్‌ చెప్పినా ఎవరూ వినలేదు.

 

View this post on Instagram

 

Finally! It’s happening 🥰❤️

A post shared by Punarnavi Bhupalam🧿 (@punarnavib) on

 

View this post on Instagram

 

I had to say yes 🙃 @itsudbhav and I will tell you all about our BIG DAY tomorrow🙈

A post shared by Punarnavi Bhupalam🧿 (@punarnavib) on

 

View this post on Instagram

 

@punarnavib She said yes🕺🏽 Naaaice 😍 Can’t wait to tell you all about the big day tomorrow 🌹

A post shared by Udbhav Raghunandan (@itsudbhav) on

Related Tags :

Related Posts :