లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Telangana

ఏకంగా బస్టాప్ నే ఎత్తుకుపోయిన దొంగలు..పట్టిస్తే బహుమతి

Published

on

Pune.Bus stop theft : దొంగలు అంటే నగలు..డబ్బు..విలువైన వస్తువులు దోచుకుపోతారు. అలాగే కార్లు..బైకులు వంటివి కూడా ఎత్తుకుపోతారు. ఇటీవల కాలంలో బస్సులు..లారీ వంటి పెద్ద పెద్ద వాహనాల్ని కూడా ఎత్తుకుపోతున్నారు. కానీ బస్టాప్ ను దొంగిలించుకోవటం ఎక్కడన్నా చూశారా? పోనీ కనీసం విన్నారా? అంటే లేదంటాం. బస్టాప్ ను ఎత్తుకుపోవటమేంటీ అని ఆశ్చర్యపోతాం కూడా..మహారాష్ట్రలో ఓ బస్టాప్ ను దొంగలు ఎత్తుకుపోయారు. దీంతో అధికారులు ఆ దొంగల్ని పట్టిస్తే రూ.5వేలు బహుమతి ఇస్తామని ప్రకటించారు.


మహారాష్ట్రలోని పూణెలో ఉండే ఓ బస్టాప్ కనిపించకుండాపోయింది. రోజు బస్సులు ఆగే బస్టాప్ కనిపించకుండాపోవటంతో ఆశ్చర్యపోయిన ఆ వ్యక్తి దాన్ని ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో అదికాస్తా వైరల్ గా మారింది. బస్టాప్ మిస్ అయిన సంగతి సోషల్ మీడియా ద్వారానే అధికారులకు కూడా తెలియటంతో వారు కూడా ఆశ్చర్యపోయారు.


13 రోజుల పసిగుడ్డు గొంతు కోసి చంపి అడవిలో పాతిపెట్టిన తల్లిదండ్రులు..


పూణె నగరంలోని దేవకి ప్యాలెస్ ఎదుట నగర పాలక సంస్థ ఓ బస్టాప్ ఏర్పాటు చేసింది. ఇది కాస్తా చోరీ అయిన విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న స్థానిక నేత.. ఎన్సీపీకి చెందిన మాజీ కార్పొరేటర్ ప్రశాంత్ అది నిజమేనని నిర్థారించుకుని.. ఆ బస్టాప్ ఫొటోను షేర్ చేస్తూ నిందితుల వివరాలు చెప్పిన వారికి రూ. 5 వేల బహుమతి ఇస్తామని ప్రకటించారు.


సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ న్యూస్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. పగటి పూట మాత్రం ఈ దొంగతనం జరగలేదని, ఎవరో దానిని రాత్రిపూట ముక్కలు చేసి పాత ఇనుప సామాన్లు కొనేవారికి అమ్మేసుకుని ఉంటారని అంటున్నారు.
గతంలో ఇక్కడ బస్టాప్ ఉన్న మాట నిజమేనని అదిప్పుడు కనిపించకపోవటం కూడా నిజమేనని స్థానికులు చెబుతున్నారు. కానీ అది చోరీకి గురైందని తెలిసి ఆశ్చర్యపోయామని దొంగలు ఇటువంటి చోరీలు కూడా చేస్తారా? అని ఆశ్చర్యం కలుగుతోందంటున్నారు.


ఏంటీ ఇదంతా వింటుంటుంటూ ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ నటించిన విక్రమార్కుడు సినిమా గుర్తుకొస్తోంది కదూ. ఈ సినిమాలో రవితేజా..బ్రహ్మానందం కలిసి పార్కుల్లో..బస్టాపుల్లో ఉండే వస్తువుల్ని కూడా చోరీ చేసి ఇంట్లో వాడేసుకంటుంటారు. రూపాయి కాయిన్ టెలీఫోన్ నుంచి డస్ట్ బిన్స్ కూడా ఎత్తుకొచ్చేస్తుంటారు. ఆఖరికి పోస్ట్ బాక్స్ కూడా ఎత్తుకొచ్చి ఇంట్లో పెట్టుకున్న సీన్లు గుర్తుకొస్తున్నాయి ఈ బస్టాప్ చోరీ ఘనటన వింటే..