లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

భార్యను కారులో వదిలి వెళ్లిన భర్త..ఆమెతో సహా కారును ఎత్తుకుపోయిన దొంగలు

Updated On - 5:05 pm, Fri, 8 January 21

punjab carjackers stolen car woman inside : పంజాబ్‌లోని డేరా బస్సిలో ఓ భర్తకు దొంగలు షాక్ ఇచ్చారు. భార్యకు కారులోనే వదిలి పనిమీద వెళ్లిన క్రమంలో ఆమెతో సహా కారును ఎత్తుకుపోయారు. గురువారం (జనవరి 7,2021) దొంగలు కార్లు, బైకులో చోరీలు చేయటం జరుగుతుంటుంది. కానీ ఈ చోరీ సదరు భర్త భార్యతో సహా ఆకారును ఎత్తుకుపోయారా దొంగలు.

గురువారం మధ్యాహ్నం డేరా బస్సికి చెందిన రాజీవ్‌ చంద్‌, రీతు దంపతులు తమ పిల్లల స్కూలు ఫీజు చెల్లించడానికి స్కూలు దగ్గరకు వచ్చారు. తరువాత కారు దిగిన భర్త కారు తాళాలు అలాగే ఉంచేసి ఫీజు కట్టి వచ్చేస్తాను..నువ్వు కారులోనే కూర్చోమని భార్యకు చెప్పిన భర్త రాజీవ్‌ స్కూల్లోపలికి వెళ్లాడు. రీతు కారు లోపలే ఉండి భర్త కోసం ఎదురుచూస్తోంది. ఇంతలో కొంతమంది వ్యక్తులు రీతు కూర్చున్న కారు దగ్గరకొచ్చారు.

తాళాలు కారుకే ఉండటం..కారులో ఓ మహిళ కూర్చుని ఉండటం గమనించారు. అంతే ఇద్దరు వ్యక్తులు బలవంతంగా కారులోకి చొరబడ్డారు. ఈ హఠాత్పరిణామానికి రీతు కంగారు పడి అరబోయింది. అంతే ఒకతను రీతు నోటిని నొక్కేశాడు.

వారిలో ఒకరు డ్రైవింగ్‌ సీటులో కూర్చోగా.. మరొకరు రీతు నోరును నొక్కేసి కారును సర్రుమంటూ లాగించేశారు. రీతుతో సహా కారును ఎత్తుకుపోయారు. అలా దాదాపు ఐదు కిలోమీటర్లు వెళ్లిన అనంతరం రీతును ఓ చోట కిందకు తోసేసి కారుతో సహా పరారైపోయారు.

ఈ క్రమంలో స్కూల్లో పని ముగించుకుని బయటకు వచ్చిన రాజీవ్‌ అక్కడ తన భార్యగానీ..కారు కనిపించకపోయే సరికి కంగారుపడిపోయాడు. వెంటనే భార్య ఫోన్ కు ఫోన్ చేసినా స్పందించకపోయే సరికి కంగారు పడి వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.

దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా విచారణ చేపట్టారు. కాగా, కొన్ని గంటల తర్వాత రీతు ఇంటికి చేరుకోవటంతో రాజీవ్‌ ఊపిరి పీల్చుకున్నాడు. జరిగిందంతా భార్య చెప్పటంతో ఆమెను బైటకు గెంటేసి కారుతో సహా వాళ్లు పరారయ్యాడని తెలుసుకున్నాడు.