లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

IPL-2020

IPL 2020, CSK vs KXIP: వికెట్ నష్టపోకుండా ఉతికేశారు.. పంజాబ్‌పై చెన్నై విజయం

Published

on

CSK

Picture

పంజాబ్‌పై చెన్నై 10వికెట్ల విజయం

04/10/2020,11:02PM

వరుస ఓటముల తర్వాత ఏ మాత్రం అంచనాలు లేకుండా పంజాబ్‌తో మ్యాచ్ ఆడిన చెన్నై సూపర్ కింగ్స్‌ అధ్బుతంగా ఆడుతుంది. 179పరుగుల టార్గెట్‌తో ఇన్నింగ్స్ ప్రారంభించిన చెన్నై వికెట్ నష్టపోకుండా 17.4ఓవర్లలో 181పరుగులు చేసి 10వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Picture

వికెట్ నష్టపోకుండా 135పరుగులు

04/10/2020,10:16PM

వరుస ఓటముల తర్వాత ఏ మాత్రం అంచనాలు లేకుండా పంజాబ్‌తో మ్యాచ్ ఆడిన చెన్నై సూపర్ కింగ్స్‌ అధ్బుతంగా ఆడుతుంది. 179పరుగుల టార్గెట్‌తో ఇన్నింగ్స్ ప్రారంభించిన చెన్నై వికెట్ నష్టపోకుండా 14ఓవర్లు ముగిసేసరికి 135పరుగులు చేసింది.

Picture

6 ఓవర్లకు 60

04/10/2020,9:58PM

పంజాబ్ తో జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై జట్టు 179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగగా.. ఓపెనర్లు క్రీజులో పాతుకుపోయారు. వాట్సన్.. డుప్లెసిస్ ఇన్నింగ్స్ కొనసాగిస్తుండగా పవర్ ప్లే ముగిసేసరికి ప్రస్తుతం 6ఓవర్లకు చెన్నై 60పరుగులు చేసింది.

 

Picture

04/10/2020,9:45PM

పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై జట్టు 179పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగగా.. ఓపెనర్లు నిలకడగా ఆడున్నారు. డూప్లెసిస్, వాట్సన్ జాగ్రత్తగా ఇన్నింగ్స్ నడిపిస్తున్నారు. ప్రస్తుతం 5ఓవర్లకు చెన్నై 41పరుగులు చేసింది.

Picture

178పరుగుల చేసిన పంజాబ్

04/10/2020,9:13PM

ఐపీఎల్ 2020 సీజన్‌లో భాగంగా దుబాయ్ వేదికగా.. చెన్నై సూపర్ కింగ్స్‌, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో నువ్వా-నేనా అన్నట్లు రెండు జట్లు తలపడుతున్నాయి. ఈ క్రమంలో మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ జట్టు.. నిర్ణీత 20ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 178పరుగులు చేసింది. చెన్నైకి 179పరుగుల టార్గెట్ విధించింది.

Picture

వరుసగా రెండు వికెట్లు.. పంజాబ్ స్కోరు 152/4

04/10/2020,8:58PM

జోరుగా పరుగులు రాణిస్తున్న పంజాబ్ వరుసగా.. రెండు వికెట్లను కోల్పోయింది. ఠాకూర్ ఓవర్లో పూరన్, రాహుల్ పక్కపక్క బంతుల్లో అవుట్ అయ్యారు.

Picture

రెండవ వికెట్ ఫట్.. స్కోరు 99/2

04/10/2020,8:29PM

16బంతుల్లో 27పరుగులు చేసిన మణిదీప్ సింగ్ అవుట్ అయ్యాడు.

Picture

మయాంక్ అవుట్.. పంజాబ్ స్కోరు 66/1

04/10/2020,8:17PM

కింగ్స్ ఎలెవన్ పంజాబ్.. చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ మంచి ఆరంభంతో దూసుకెళ్తుంది. మొదట్లో పరుగుల వరద పారించిన పంజాబ్.. పియూష్ చావ్లా ఓవర్లో వికెట్ కోల్పోయింది. 19బంతుల్లో 26పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్ అవుట్ అయ్యాడు.

Picture

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (Playing):

04/10/2020,7:52PM

కెఎల్ రాహుల్ (w/c), మయాంక్ అగర్వాల్, మన్‌దీప్ సింగ్, నికోలస్ పూరన్, గ్లెన్ మాక్స్వెల్, సర్ఫరాజ్ ఖాన్, క్రిస్ జోర్డాన్, హర్‌ప్రీత్ బ్రార్, రవి బిష్ణోయ్, మహ్మద్ షమీ, షెల్డన్ కాట్రెల్

Picture

చెన్నై సూపర్ కింగ్స్ (Playing):

04/10/2020,7:52PM

షేన్ వాట్సన్, అంబటి రాయుడు, ఫాఫ్ డు ప్లెసిస్, ఎంఎస్ ధోని (W/C), కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, సామ్ కర్రన్, శార్దుల్ ఠాకూర్, పియూష్ చావ్లా, దీపక్ చాహర్

Picture

టాస్ గెలిచిన పంజాబ్

04/10/2020,7:22PM

చెన్నై సూపర్ కింగ్స్‌తో మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 18వ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కింది నుంచి రెండు స్థానాల్లో ఉన్న ఈ రెండు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. చెన్నై వరుసగా ఓటమి పాలవుతుండగా ఐపీఎల్‌లో పట్టు కోసం పంజాబ్ ఎదురు చూస్తుంది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *