-
Home » KXIP vs DC: గబ్బర్ సెంచరీ వృధా.. సజీవంగా ప్లే ఆఫ్ ఆశలు.. ఢిల్లీపై పంజాబ్ విజయం
IPL-2020
KXIP vs DC: గబ్బర్ సెంచరీ వృధా.. సజీవంగా ప్లే ఆఫ్ ఆశలు.. ఢిల్లీపై పంజాబ్ విజయం
Published
4 months agoon
By
vamsi
ఢిల్లీపై పంజాబ్ విజయం
20/10/2020,11:11PMఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్ 38 వ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (Kings XI Punjab) మరియు ఢిల్లీ క్యాపిటల్స్(DC)పై 5వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 19ఓవర్లలో 167పరుగులు చేసి పంజాబ్ జట్టుపై 5 వికెట్లు తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గబ్బర్ సెంచరీ వృధా అవగా.. పంజాబ్ ప్లే ఆఫ్ ఆశలు సజీవంగానే ఉన్నాయి.. ఢిల్లీపై విజయంతో పంజాబ్ జట్టు పాయింట్ల పట్టికలో 10మ్యాచ్‌లలో నాలుగు విజయాలతో 5వ ప్లేస్‌లోకి చేరుకుంది. పంజాబ్ జట్టుకు ఇది హ్యాట్రిక్ విక్టరీ.
పంజాబ్ టార్గెట్ 165
20/10/2020,9:17PMపంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శిఖర్ ధావన్(106*) సెంచరీతో రాణించగా.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. మహ్మద్ షమి వేసిన చివరి ఓవర్లో 7 పరుగులే రాగా.. హెట్‌మైయిర్(10) చివరి బంతికి బౌల్డ్ అయ్యాడు. దీంతో పంజాబ్ టార్గెట్ 165పరుగులుగా ఫిక్స్ అయ్యింది.
శతక్కొట్టిన గబ్బర్.. ఢిల్లీ స్కోరు 159/4
20/10/2020,9:08PMపంజాబ్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాట్స్మెన్లు అవుట్ అవుతున్నా ప్రత్యర్థి బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ ధావన్ ఒంటరిగా పోరాటం చేస్తున్నాడు. ఏ దశలోనూ ఇబ్బంది పడని గబ్బర్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. ఈ క్రమంలోనే 12ఫోర్లు, 3సిక్సర్లతో 57బంతుల్లో 101పరుగులు పూర్తి చేసుకున్నాడు గబ్బర్. ఐపీఎల్లో వరుసగా ధావన్‌కు ఇది రెండో సెంచరీ.. చెన్నైతో మ్యాచ్‌లో ధావన్ 58బంతుల్లో 101పరుగులు చేశాడు.
సెంచరీకి దగ్గరగా ధావన్.. స్టాయిన్స్ అవుట్ 141/4(17.3)
20/10/2020,9:01PMపంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ధావన్ మరోసారి చెలరేగి ఆడుతున్నాడు. ఫస్ట్ ఓపెనర్‌గా బ్యాటింగ్‌కు దిగిన ధావన్.. సెంచరీకి దగ్గరగా వచ్చాడు. ప్రస్తుతం 52బంతుల్లో 93పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. ఈ క్రమంలోనే స్టాయిన్స్ అవుట్ అయ్యాడు. 10బంతుల్లో 9పరుగులు చేసి స్టాయిన్స్ అవుట్ అయ్యాడు.
శ్రేయాస్ అవుట్.. ధనాధన్ గబ్బర్.. 90/2(11)
20/10/2020,8:32PMపంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు దూకుడుగా ఆడుతుంది. స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ అర్ధశతకంతో రాణించగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 12బంతుల్లో 14పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ధావన్ ధాటిగా ఆడుతుండగా.. మురుగన్ అశ్విన్ వేసిన 9వ ఓవర్లో తొలి రెండు బంతుల్లో ఒక బౌండరీ, ఒక సింగిల్ తీసి అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. తర్వాత మూడో బంతికి శ్రేయస్ అయ్యర్ అవుట్ అయ్యాడు. ప్రస్తుతం 11ఓవర్లకు ఢిల్లీ జట్టు స్కోర్ 90/2గా ఉంది.
దూకుడుగా ఆడుతున్న ధావన్.. ఢిల్లీ స్కోరు 53/1
20/10/2020,8:09PMపవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ జట్టు దూకుడుగా ఆడింది. ఒక్క వికెట్ నష్టపోయి 53పరుగులు చేసింది. ఓపెనర్లుగా ధావన్, పృథ్వీ షా రాగా.. ధావన్ ఫోర్లు, సిక్సర్లతో పంజాబ్ బౌలర్లపై విరుచుకు పడుతున్నాడు. అయితే జేమ్స్ నీషమ్ వేసిన నాలుగో ఓవర్ రెండో బంతికి పృథ్వీషా ఏడు పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. అతడు ఆడిన షాట్ అంచనా తప్పడంతో బంతి గాల్లోకి లేవగా.. మాక్స్వెల్ క్యాచ్ పట్టుకున్నాడు. దీంతో 25 పరుగుల వద్ద ఢిల్లీ తొలి వికెట్ కోల్పోయింది.
మెరుగైన స్థానంలో ఢిల్లీ:
20/10/2020,7:09PMఫస్ట్ ప్లేస్‌లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఏడవ స్థానంలో ఉన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుతో పోటీ పడుతూ ఉండగా.. ఈ మ్యాచ్‌లో గెలిచి పంజాబ్ పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలోకి రావాలని భావిస్తుంది. తన చివరి మ్యాచ్‌లో పటిష్టంగా ఉన్న ముంబై జట్టుపై విజయం సాధించిన పంజాబ్ జట్టు.. ఈ మ్యాచ్‌లో ఢిల్లీపై కూడా గెలవాలనే ఉత్సాహంతో బరిలోకి దిగుతుంది. మరోవైపు ఢిల్లీ ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లలో మాత్రమే ఓడిపోగా.. తన చివరి మ్యాచ్‌లో పంజాబ్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ ఓవర్లో గెలిచింది.
టాస్ గెలిచిన ఢిల్లీ
20/10/2020,7:08PMIPL 2019 Live, DC vs KXIP: ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఫస్ట్ పంజాబ్ జట్టు బౌలింగ్ చేయనుంది. ఢిల్లీ పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉండగా, పంజాబ్ జట్టు ఏడవ స్థానంలో ఉంది.
You may like
-
చెన్నై టెస్టు : అశ్విన్ మాయాజాలం, ఇంగ్లండ్ 134 రన్లు, ఆలౌట్
-
ఫస్ట్ టెస్ట్‌లో చిత్తుగా ఓడిన భారత్.. 8వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం
-
SRH vs MI, ప్లే ఆఫ్‌కి వెళ్లాలంటే గెలవాలి: కీలక మ్యాచ్‌లో ముంబైపై టాస్ గెలిచిన హైదరాబాద్
-
MI vs RR IPL 2020: హార్ధిక్ మెరుపులు.. ముంబై భారీ స్కోరు.. రాజస్థాన్ టార్గెట్ 196
-
IPL 2020, RCB vs CSK: టాస్ గెలిచిన బెంగళూరు.. చెన్నై బౌలింగ్..
-
IPL 2020, KXIP vs SRH: తక్కువ స్కోరుకే చతికిలపడ్డ పంజాబ్.. హైదరాబాద్ టార్గెట్ 127

ఆర్టీసీ సమ్మె, నిలిచిపోనున్న బస్సులు!

ఏం మలినేని.. మే లో మొదలెడదామా!

జైలులో పవన్ గారి ఫొటో పెడితే బాగోదుగా.. నితిన్..

‘క్షణ క్షణం’ సినిమా పెద్ద హిట్ కావాలి – అల్లు అరవింద్..

తలలు తెగిపడ్డాయి..కాళ్లు, చేతులు నరికివేశారు

పరువాల పూనమ్ బజ్వా ఫొటోస్

‘ఉప్పెన’ సక్సెస్ సెలబ్రేషన్స్..

అనన్య నాగళ్ల ఫొటోస్

ప్రగతి ఫొటోలు చూశారా!

‘లీడర్’ హీరోయిన్ ప్రియా ఆనంద్ ఫొటోస్

కేంద్ర ప్రభుత్వానికి రైతుల హెచ్చరిక

ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ సన్నాహక సమావేశం

ఐదు రాష్ట్రాల్లో విస్తరిస్తున్న కరోనా

ఎంపీ కేశినేని నాని Vs మంత్రి వెల్లంపల్లి
