మళ్లీ ఆ రోజులు రావాలి.. వీడియో చూశాక కన్నీళ్లు వచ్చాయి.. పూరి ఎమోషనల్ ట్వీట్..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Puri Jagannadh – Movie Theatres: కరోనా మహమ్మారి అన్ని రంగాలను తీవ్రంగా దెబ్బ తీసింది. ముఖ్యంగా సినీ పరిశ్రమపై దీని ప్రభావం ఎంత అనేది మాటల్లో చెప్పలేం. షూటింగులు నిలిచిపోయాయి. సినిమా థియేటర్లు బంద్ అయిపోయాయి. అన్‌లాక్ తర్వాత కూడా థియేటర్లు తెరుచుకోవడం లేదు.

థియేటర్లకు వచ్చేందుకు ప్రేక్షకులు ఆసక్తి కనబరచడం లేదు. దీంతో సినిమాలను విడుదల చేసేందుకు నిర్మాతలు ముందుకు రావడం లేదు. ప్రేక్షకులను థియేటర్లకు ఎలా రప్పించాలో వారికి అర్థం కావడం లేదు.
ఈ నేపథ్యంలో కన్నడ సినీ పరిశ్రమ ‘కమ్.. లెట్స్ సెలబ్రేట్ సినిమా అగైన్’ పేరుతో ఓ వీడియోను రూపొందించింది.


డా.శివ రాజ్‌కుమార్, పునీత్ రాజ్‌‌కుమార్, శ్రీ మురళి, గణేష్, విజయ్, ధనుంజయ్ వంటి స్టార్ హీరోలు అంతా కలిసి ‘‘సినిమా థియేటర్లు అభిమానులకు దేవాలయాలు వంటివి.. మళ్లీ థియేటర్లకు రండి, కలిసి సెలబ్రేట్ చేసుకుందాం’’.. అంటూ వీడియోలో పేర్కొన్నారు.


తాజాగా విడుదలైన ఈ వీడియో చూసి డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఎమోషనల్ అయ్యారు. ‘ఈ వీడియో చూశాక కన్నీళ్లు వచ్చాయి. మళ్ళీ ఆ రోజులు రావాలి.. విజిల్స్ వెయ్యాలి.. పేపర్స్ ఎగరాలి.. చొక్కాలు చిరగాలి.. సినిమా థియేటర్.. మన అమ్మ’.. అని పేర్కొంటూ ఆ వీడియోను షేర్ చేశారు పూరీ.

Related Tags :

Related Posts :