బన్నీ నీకోసం ఒక ఎక్స్‌ట్రా పెగ్ వేస్తా.. చీర్స్!..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

బాధ అయినా ఆనందం అయినా మగాళ్లకి(అలవాటు ఉన్నవాళ్లకి) ఠక్కున గుర్తొచ్చేది మందు.. బాధ ఎక్కువైనా, సంతోషం రెట్టింపైనా రెగ్యులర్‌గా తాగేదాని కన్నా డోస్ డబుల్ అవాల్సిందే. ఇప్పుడు డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ కూడా ఆనందంతో మరో పెగ్ ఎక్స్‌ట్రా వేశారట. దానికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసే కారణం ..

ఇప్పటివరకు తన పదునైన డైలాగులను తన హీరోల చేత పలికించిన పూరీ జగన్నాథ్.. తాజాగా తనే స్వయంగా రంగంలోకి దిగారు. గతకొద్ది రోజులుగా పోడ్‌కాస్ట్ ద్వారా తన ఆలోచనలను, అభిప్రాయాలను నేరుగా అభిమానులతో పంచుకుంటున్నారు. వీటికి మంచి ఆదరణ లభిస్తోంది. తాజాగా అల్లు అర్జున్, పూరి చెబుతున్న టాపిక్స్ గురించి ట్వీట్ చేశాడు.

‘పూరి గారు.. మీ పోడ్‌కాస్ట్‌లలో చెబుతున్న అద్భుతమైన అంశాలు, వ్యక్తిగత అభిప్రాయాలు చాలా గొప్పగా ఉన్నాయి. నాకు చాలా బాగా నచ్చాయి. ఇలాంటి మంచి టాపిక్స్ మరెన్నింటినో మీరు చర్చించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాన’ని బన్నీ ట్వీట్‌ చేశాడు.

దీనికి స్పందించిన పూరి.. ‘బన్నీ.. నీ ట్వీట్‌ చదువుతూ ఆనందంతో ఉప్పొంగిపోతున్నా. నీలాంటి సక్సెస్‌ఫుల్ యంగ్‌స్టర్ నుంచి ఇంత గొప్ప ప్రశంస అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు రాత్రికి ఒక ఎక్స్‌ట్రా పెగ్ వేస్తా. చీర్స్.. లవ్ యూ’ అని రిప్లై ఇచ్చారు. పూరి, బన్నీ కాంబోలో ‘దేశముదురు, ఇద్దరమ్మాయిలతో’ సినిమాలు వచ్చాయి.

Related Posts