లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

మౌనం వీడిన అద్వానీ : నేషన్ ఫస్ట్..పార్టీ నెక్స్ట్..సెల్ఫ్ లాస్ట్

Published

on

Put party first, self last, don't call anyone anti-national: LK Advani writes blog

గాంధీనగర్ లోక్ సభ స్థానానికి అమిత్ షా ఎంపిక విషయంలో జరిగిన పరిణామాలతో బీజేపీ అగ్రనాయకత్వంపై అలకబూనిన బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీ ఎట్టకేలకు బ్లాగ్ ద్వారా తన మనసులో మాటలను బయటపెట్టారు.నేషన్ ఫస్ట్…పార్టీ నెక్స్ట్…సెల్ఫ్ లాస్ట్ అన్న హెడ్ లైన్ తో 509 పదాలతో పొడవైన లేఖను తన బ్లాగ్ లో ఉంచారు.శనివారం(ఏప్రిల్-6,2019)బీజేపీ ఫౌండేషన్ సందర్భంగా కార్యకర్తలకు బ్లాగ్ ద్వారా దిశానిర్దేశం చేశారు అద్వానీ.1991నుంచి ఆరుసార్లు లోక్ సభకు పంపిన నా గాంధీనగర్ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ణతలు అని అద్వానీ తెలిపారు.వారి ప్రేమ, మద్దతు ఎల్లప్పుడూ సంతోషాన్నిచ్చిందని తెలిపారు.

 అద్వానీ తన బ్లాగ్ లో….బీజేపీలో ఉన్న మనందరికీ ఇది చాలా ముఖ్యమైన రోజు..ఆత్మపరిశీలనతో పాటు గత జ్ఞాపకాలు, భవిష్యత్‌ కార్యాచరణ గురించి ఆలోచించాల్సిన రోజు.ముందుకు వెళ్దాం.బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకడిగా దేశ ప్రజలతో,మరీ  ముఖ్యంగా నా పార్టీలోని లక్షలాది మంది కార్యకర్తలతో నా రిఫ్లెక్షన్స్ పంచుకోవడం నా బాధ్యతగా పరిగణిస్తాను.ఇద్దరూ కూడా తమ ఆపాయ్యత,గౌరవాలతో నన్ను రుణపడి ఉండేలా చేశారు.మొదట దేశం…ఆ తర్వాతే వ్యక్తిగతం ఇదే నా జీవితపు సిద్దాంతం అని అద్వాణీ తెలిపారు.అన్నీ సందర్భాల్లో ఈ సిద్దాంతానికి కట్టుబడి ఉన్నానని..ఇలానే భవిష్యత్తులో కూడా ఉంటానని తెలిపారు.

భావవ్యక్తీకరణ స్వేచ్ఛ అంశం గురించి ప్రస్తావిస్తూ…భారతదేశ ప్రజాస్వామ్య గొప్పతనం.. భావవ్యక్తీకరణను,భిన్నత్వంలో ఏకత్వాన్ని గౌరవించడమేనన్నారు.మొదటి నుంచీ కూడా రాజకీయంగా తమను వ్యతిరేకించేవాళ్లని బీజేపీ ఎప్పుడూ శతృవులుగా చూడలేదన్నారు.కేవలం విపక్షంగా మాత్రమే చూశామని తెలిపారు.

జాతీయత గురించి ప్రస్తావిస్తూ…బీజేపీలోని జాతీయవాదం భావన గురించి ఉద్దేశించి మమల్ని రాజకీయంగా విభేదించిన వారిని మేమెప్పుడూ దేశ వ్యతిరేకులుగా చూడలేదన్నారు.దేశంలోని ప్రతి పౌరుడి వ్యక్తిగత, అదే విధంగా పొలిటికల్ స్థాయిలో ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ కి పార్టీ కట్టుబడి ఉందన్నారు. నిజమైన ఎన్నికలు ప్రజాస్వామ్య పండుగ అని అద్వానీ తెలిపారు.

14 ఏళ్ల వయసు ఉన్నప్పుడు రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ లో చేరాను. అప్పటి నుంచి మాతృభూమికి సేవ చేయడం అలవాటుగా మారింది. నా రాజకీయ జీవితంలో జనసంఘ్‌, బీజేపీలతో ఏడు దశాబ్దాలుగా విడదీయలేని అనుబంధంగా ఉంది. మొదట భారతీయ జనసంఘ్‌, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేశాం. రెండింటిలో నేను వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్నాను. దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ, అటల్‌ బిహారీ వాజ్‌పేయీతో పాటు పలువురు స్ఫూర్తిదాయక, నిస్వార్థ నేతలతో పని చేసే గొప్ప అవకాశం నాకు దక్కింది.అని అద్వానీ తన బ్లాగ్ ద్వారా తెలిపారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *