నా ఫ్యామిలీ, కోచ్ గోపిచంద్‌తో ఎలాంటి విభేదాల్లేవ్ : పీవీ సింధు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

PV Sindhu  Rift With Family, Coach  : తన కుటుంబంలో గొడవల తర్వాత తాను నేషనల్ క్యాంప్ విడిచిపెట్టి.. యూకే వెళ్లానట్టు వచ్చిన వార్తలను భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కొట్టిపారేసింది.

తన ఫ్యామిలీతో కానీ కోచ్ పుల్లెల గోపిచంద్ తో కానీ తనకు ఎలాంటి విభేదాలు లేవని ఇన్ స్టాగ్రామ్ వేదికగా సింధు ఖండించింది.ప్రస్తుతం తాను లండన్‌లో ఉన్నానని, అక్కడ తాను కోలుకునేందుకు అవసరమైన న్యూట్రిషయన్ కోసం Gatorade Sports Science Institute (GSSI)తో కలిసి పనిచేస్తున్నాని చెప్పింది.

అలా పుట్టడం నా తప్పా? ‘800’ వివాదంపై మురళీధరన్ స్పందన.. విజయ్ సేతుపతికి రాధిక మద్దతు..


తన తల్లిదండ్రుల అంగీకారంతోనే దేశం విడిచి వెళ్లానని, తన కుటుంబ సభ్యులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతునే ఉన్నానని ఒలింపిక్ రజత పతక విజేత పేర్కొంది.“నేను GSSI తో నా పోషణ, పునరుద్ధరణ అవసరాలకు పని చేయడానికి కొద్ది రోజుల క్రితం లండన్ వచ్చాను. నా తల్లిదండ్రుల సమ్మతితోనే నేను ఇక్కడకు వచ్చాను.

కచ్చితంగా ఈ విషయంలో ఎలాంటి కుటుంబ విభేదాలు లేవు. నా లైఫ్ కోసం త్యాగం చేసిన తల్లిదండ్రులతో నాకు ఎందుకు సమస్యలు ఉంటాయి’ అని పివి సింధు తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో రాసుకొచ్చింది.నాది చాలా దగ్గరగా ఉన్న కుటుంబం.. వారు ఎప్పుడూ నాకు సపోర్టు చేస్తూనే ఉంటారు. నేను ప్రతిరోజు నా కుటుంబ సభ్యులతో మాట్లాడుతూనే ఉంటాను.

అలాగే నా కోచ్ గోపిచంద్ లేదా అకాడమీలో శిక్షణా సదుపాయాలతో నాకు ఎలాంటి సమస్యలు లేవని పీవీ సింధు స్పష్టం చేసింది.ఒక నివేదిక ప్రకారం.. సింధు దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిందని, వచ్చే ఎనిమిది నుంచి పది వారాల వరకు తిరిగి రాలేనంటూ పుల్లెల గోపీచంద్ అకాడమీలో కోచ్లకు సమాచారం ఇచ్చినట్టు నివేదిక పేర్కొంది.అంతకుముందు, ప్రపంచ ఛాంపియన్ GSSIలో పనిచేసే Rebecca Randellతో కలిసి లండన్‌లో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందని ఒక ఫొటోను పీవీ సింధు పోస్ట్ చేసింది.

ఇంగ్లాండ్‌లో ఉండటం సంతోషంగా ఉందని తెలిపింది. ఆసియా పర్యటనకు 3 నెలలు ఉందని, ఈలోగా తాను మెరుగుపడటానికి ఇది మంచి అవకాశమని సింధు తెలిపింది.

 

View this post on Instagram

 

I came to London a few days back to work on my nutrtion and recovery needs with GSSI.Infact I have come here with the consent of my parents and absolutely they were no family rifts in this regard. Why will I have problems/issues with my parents who have sacrificed their lives for my sake. Mine is a very close knitted family and they will always support me. I am in touch with my family members everyday. Also I do not have any issues with my coach Mr Gopichand or the training facilities at the academy. Mr M. Ratnakar the sports reporter of TOI who is spreading false news should know the facts first before writing them. If he doesn’t stop, I may have to resort to legal proceedings against him. @toi_sports @gopichandpullela

A post shared by sindhu pv (@pvsindhu1) on

Related Tags :

Related Posts :