క్వారంటైన్ కేంద్రంలో కామాంధుడు, యువతిపై అటెండెంట్ మూడుసార్లు అత్యాచారం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కామాంధులు రెచ్చిపోతున్నారు. కోరికలు తీర్చుకోవడానికి నీచానికి దిగజారుతున్నారు. ఆఖరికి కరోనా క్వారంటైన్ కేంద్రంలోనూ బరితెగిస్తున్నారు. తాజాగా కరోనా క్వారంటైన్ కేంద్రంలో ఓ యువతిపై అటెండెంట్(27) అత్యాచారానికి పాల్పడ్డాడు. అది కూడా ఏకంగా మూడు సార్లు రేప్ చేశాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని క్వారంటైన్ కేంద్రంలో చోటుచేసుకుంది.

థానే జిల్లాలోని మిరా రోడ్డులో ఉన్న క్వారంటైన్ కేంద్రంలో 20ఏళ్ల యువతిపై అటెండెంట్ 3సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూన్ లో ఈ ఘటన జరగ్గా, శనివారం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది.

రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు బ్లాక్ మెయిల్ చేయడంతో ఇన్నాళ్లూ నోరు మెదపలేదని బాధితురాలు చెప్పింది. క్వారంటైన్ కేంద్రంలో ఉన్న తన బంధువు(11 ఏళ్ల వయసు) బాగోగులు చూసేందుకు ఆమె కొన్నాళ్లు తోడుగా ఉంది. ఆ సమయంలో ఈ ఘటన జరిగినట్టు చెప్పింది.

బాధితురాలు తన 10 నెలల పాపతో క్వారంటైన్ కేంద్రంలోని ఓ రూమ్ లో ఉండేది. అదే సమయంలో అక్కడ అటెండెంట్ గా పని చేసే వ్యక్తి కన్ను ఆమెపై పడింది. వేడి నీరు ఇస్తానని చెప్పి అటెండెంట్ పదే పదే ఆమె ఉంటున్న రూమ్ లోకి వెళ్లేవాడు. తన కోరిక తీర్చాలని ఆమెని వేధించాడు. అందుకు ఆమె నిరాకరించింది. నా కోరిక తీర్చకుంటే నీ పాపను చంపేస్తానని అటెండెంట్ యువతిని బెదిరించాడు. దీంతో ఆమె లొంగిపోయింది. జూన్ తొలి వారంలో మూడు వేర్వేరు సందర్భాల్లో అత్యాచారం చేశాడు. అయితే తన కుటుంబానికి హాని తలపెడతాడనే భయంతో బాధితురాలు మౌనంగా ఉండిపోయింది.

క్వారంటైన్ కేంద్రాలు, ప్రభుత్వ కరోనా ఆసుపత్రుల్లో జరుగుతున్న ఘోరాలు మహిళలు, యువతులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. కరోనా చికిత్స తీసుకునేందుకు క్వారంటైన్ కేంద్రాలకు, ఆసుపత్రులకు వెళ్లాంటేనే వణికిపోతున్నారు.

Related Posts