లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

రాగల 24 గంటల్లో – టీజర్

సత్యదేవ్, ఈషా రెబ్బా, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ (పైసావసూల్ ఫేమ్), ప్రధానపాత్రల్లో నటిస్తున్న.. ‘రాగల 24 గంటల్లో’.. టీజర్ రిలీజ్..

Published

on

Raagala 24 Gantallo - Teaser

సత్యదేవ్, ఈషా రెబ్బా, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ (పైసావసూల్ ఫేమ్), ప్రధానపాత్రల్లో నటిస్తున్న.. ‘రాగల 24 గంటల్లో’.. టీజర్ రిలీజ్..

సత్యదేవ్, ఈషా రెబ్బా, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ (పైసావసూల్ ఫేమ్), ప్రధానపాత్రల్లో నటిస్తున్న సినిమా.. ‘రాగల 24 గంటల్లో’.. శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో, శ్రీ కార్తికేయ సెల్యూలాయిడ్స్ సమర్పణలో, శ్రీ నవ్‌హాస్ క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీనివాస్ కానూరి నిర్మిస్తున్నాడు. రీసెంట్‌గా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసారు.

‘వార్తల్లో  వాతావరణం గురించి చెప్పేటప్పుడు రాగల 24 గంటల్లో అని అంటుంటారు, ఊహించని సంఘటనలతో ఈ సినిమాను సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నాం.. రాగల 24 గంటల్లో అనుకోని సంఘటనలు జరుగుతాయని తెలిసినప్పుడు ఎవరెలా స్పందించారు, అసలు ఆ 24 గంటల్లో ఏం జరిగింది అనేది ఆసక్తికరంగా ఉంటుంది’ అని మేకర్స్ చెప్తున్నారు.

Read Also : సైరా – కామిక్స్ బుక్ వచ్చేస్తుంది!

ఇప్పటివరకు కామెడీ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి మొదటిసారి థ్రిల్లర్ సినిమా చేస్తుండడం విశేషం. తమిళ హీరో శ్రీరామ్ ఇంపార్టెంట్ రోల్‌లో నటించాడు. చాలాకాలం తర్వాత కృష్ణభగవాన్ ఈ సినిమాలో కనిపించనున్నాడు. అక్టోబర్‌లో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. మాటలు : కృష్ణభగవాన్, సంగీతం : రఘుకుంచె, లిరిక్స్ : భాస్కరభట్ల, శ్రీమణి, కెమెరా : అంజి, ఎడిటింగ్ : తమ్మిరాజు, ఆర్ట్ : చిన్నా.