Rachakonda CP Mahesh Bhagwat Pressmeet on rajitha Murder case

స్కెచ్ విని కమిషనరే షాక్ : దృశ్యం సినిమాను తలపించేలా తల్లిని చంపిన కీర్తిరెడ్డి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ప్రియుడితో కలిసి కన్నతల్లినే అత్యంత దారుణంగా హతమార్చిన కేసులో నిందితురాలు కీర్తిరెడ్డి, శశికుమార్, బాల్ రెడ్డి లను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. రజిత హత్య కేసు”దృశ్యం” సినిమాను తలపించేలా ఉందని రాచకొండ పోలీసు కమీషనర్  మహేష్ భగవత్ అన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు కీర్తి, బాల్ రెడ్డి,  శశికుమార్ లను   గురువారం ఆయన విలేకరుల ముందు ప్రవేశపెట్టారు.

పోలీసు కమీషనర్ మహేష్ భగవత్ మాట్లాడుతూ  కీర్తిరెడ్డి మైనర్ గా ఉన్నప్పుడు బాల్ రెడ్డి అనేవ్యక్తి రేప్ చేశాడని, ఆసమయంలో ఆమె గర్భం ధరించిందని చెప్పారు. కీర్తికి అబార్షన్ చేయించుకునేందుకు ఇంటి సమీపంలోని శశి కుమార్ సహాయం తీసుకుంది. శశికుమార్ కీర్తిని అమనగల్లు తీసుకువెళ్లి అబార్షన్ చేయించాడు. కీర్తి అబార్షన్ తర్వాత శశికుమార్ ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. బాల్ రెడ్డి ఆస్తిపరుడు, పలుకుబడి కలవాడని తెలుసుకుని, కీర్తి ద్వారా డబ్బులు సంపాదించాలని చూశాడు. ఆమె గర్భం ధరించిన విషయం ఎవరికీ చెప్పకుండా ఉండాలంటే 10 లక్షల రూపాయలు కావాలనిడిమాండ్ చేశాడు.  శశికుమార్ తండ్రి విద్యుత్ శాఖలో పనిచేస్తూ ఇటీవలే ఏసీబీకి చిక్కి సస్పెండ్ అయినట్లు సీపీ చెప్పారు.
 
బాల్ రెడ్డి, శశికుమార్ లతో స్నేహంగా ఉంటున్న కీర్తి రెడ్డిని తల్లి రజిత మందలించింది. తమ స్నేహానికి తల్లి అడ్డుగా ఉండటంతో శశికుమార్ తల్లిని హత మారిస్తే అడ్డం తొలిగిపోతుందని కీర్తికి చెప్పాడు. తల్లిని హత మార్చేందుకు ప్రియుడు శశికుమార్ సహాయం తీసుకుంది. గతంలోనే ఒకసారి నిద్రమాత్రలు ఇచ్చి తల్లిని చంపాలని నిర్ణయించుకుంది. అప్పుడు ప్లాన్ సక్సెస్ కాకపోవటంతో శశికుమార్ సహాయం తీసుకుంది.

శశి కుమార్ చెప్పినట్లు  తల్లిని చంపటానికి ధైర్యం చాలక మద్యం సేవించినట్లు పోలీసులకు వెల్లడించింది. అక్టోబరు 19వ తేదీ మద్యం సేవించి వచ్చి..కీర్తి తన తల్లికి నిద్రమాత్రలు ఇచ్చింది. రజిత నిద్రలో ఉండగా…మొఖంపై ఊపిరాడకుండా దిండుతో అదిమి పెట్టగా,  శశికుమార్ చున్నీ మెడకు బిగించి హత్య చేశాడని మహేష్ భగవత్ చెప్పారు.

హత్య అనంతరం శశికుమార్, రజిత శవాన్ని 3 రోజుల పాటు ఇంట్లోనే ఉంచారు. ఈలోపు ఆమె బాల్ రెడ్డి ఇంటికి 2 రోజులు వెళ్లి వచ్చింది. 3వరోజు శవం నుంచి దుర్వాసన రావటంతో,శశి, కీర్తి, శవాన్ని బెడ్ షీట్ లో చుట్టుకుని,  కారులో రామన్నపేట రైల్వేట్రాక్ వద్దకు తీసుకువెళ్లి  పారేసి వచ్చారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఏమీ తెలియనట్లు..తన తల్లి కనపడటంలేదని  కీర్తి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు విచారణ చేపట్టిన  పోలీసులు తమదైన స్టైల్లో విచారణ చేయడంతో కీర్తి రోజుకో నిజం పోలీసులకు చెప్పింది. వీరిపై 3 కేసులు నమోదు చేసామని మహేష్ భగవత్ చెప్పారు.  కేసు విచారణలో భాగంగా మరింత సమచారం నిందితులనుంచి రాబట్టాల్సిఉందని సీపీ తెలిపారు. 

READ  హైదరాబాద్‌లో 6న వాటర్ సరఫరా బంద్ అయ్యే ప్రాంతాలు ఇవే

Related Posts