లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

‘రాధే శ్యామ్’ రాక ఎప్పుడంటే..

Published

on

Radhe Shyam: ‘రాధే శ్యామ్’.. అప్పుడెప్పుడో రెండేళ్ల క్రితం మొదలుపెట్టిన సినిమా.. అదేదో ‘బాహుబలి’ లాంటి భారీ సినిమా కాదు.. అయినా సరే జక్కన్నకు మించి చెక్కుతున్నారు టీమ్. ఆ చెక్కుడు లాస్ట్ స్టేజ్‌కి రావడంతో ఫైనల్లీ రిలీజ్ టైమ్ ఫిక్స్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. మరి వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న ‘రాధే శ్యామ్’ ఫ్యాన్స్ ముందుకెప్పుడు రాబోతున్నారు..?

రెండున్నరేళ్లుగా తెరకెక్కుతున్న ప్రభాస్ ప్రేమకథ ఓ కొలిక్కొచ్చింది. లాక్‌డౌన్ బ్రేక్ వేసినా.. ఎలా గొలా షూటింగ్ లాస్ట్ స్టేజ్‌కి తెప్పించారు మేకర్స్. పూజా హెగ్డే, ప్రభాస్ జంటగా ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ ప్రేమ కావ్యం రిలీజ్‌కు రంగం సిద్ధం చేస్తున్నారు. దాదాపు రూ. 200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ప్రభాస్ మూవీ ఫినిషింగ్ టచెస్ చేసుకుంటోంది.

సలీమ్-అనార్కలీ, దేవదాస్-పార్వతి అంతటి గొప్ప ప్రేమికుల తర్వాత ‘రాధే శ్యామ్’ అంటూ ఈ సినిమా ఎంత ఇంటెన్స్ లవ్ స్టోరీయో హింట్ ఇచ్చి ఆడియన్స్‌ని తెగ ఖుష్ చేశారు టీమ్. ఈ సినిమా 70 కాలంలో రోమ్ బ్యాక్ డ్రాప్‌లోని రెట్రో లవ్ స్టోరీగా రూపొందుతోంది. యాక్షన్ నుంచి బ్రేక్ తీసుకుని విక్రమాధిత్యగా ‘రాధే శ్యామ్’ లో క్యూట్‌గా కనిపించబోతున్నారు ప్రభాస్. ఎన్నాళ్ల నుంచో వెయిట్ చేస్తున్న ‘రాధే శ్యామ్’ రిలీజ్‌కు మరో మూడు నెలల్లో ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్.

ఇటలీ, జార్జియాలోని బ్యూటిఫుల్ లొకేషన్స్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ విక్రమాధిత్య క్యారెక్టర్‌లో అంతకుముందులా లవర్ బాయ్ క్యారెక్టర్‌లో ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చెయ్యబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లతో ఎంత ఇంటెన్స్ లవ్ స్టోరీయో తెలిసిపోతోంది. ఇప్పటికే ప్రభాస్, పూజా హెగ్డే ఇద్దరూ ‘రాధే శ్యామ్’ షూటింగ్‌ని కంప్లీట్ చేసుకున్నారు. అందుకే ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేసి, రెండు నెలల్లో పోస్ట్ ప్రొడక్షన్ ఫినిష్ చేసి ఏప్రిల్ నాటికి సినిమా రిలీజ్ చేద్దామని గట్టిగా ఫిక్స్ అయ్యారు ‘రాధే శ్యామ్’ టీమ్. సినిమా సమ్మర్‌కి రానుండడంతో ఫ్యాన్స్ ఇప్పటి నుంచే సంబరాలు స్టార్ట్ చేసేస్తున్నారు.