టాటా సఫారిలో ప్రియాంక డ్రైవింగ్.. పక్కసీట్లో రాహుల్..!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Hathras gang-rape victim’s family: దేశవ్యాప్తంగా సంచలనం రేకిత్తించిన హత్రాస్ అత్యాచార ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధితురాలి కుటుంబాన్ని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పరామర్శించారు. హత్రాస్ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు రాహుల్‌, ప్రియాంక గాంధీని పోలీసులు అనుమతినిచ్చారు.వారిద్దరితో సహా ఐదుమంది హత్రాస్ వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. రాహుల్‌, ప్రియాంక (Rahul Gandhi, Priyanka Gandhi) నొయిడా టోల్‌ ప్లాజాకు వెళ్లారు. అక్కడి నుంచి టాటా సఫారి వాహనాన్ని ప్రియాంక స్వయంగా డ్రైవ్‌ చేశారు. రాహుల్‌ గాంధీ పక్క సీట్లో కూర్చొన్నారు. మరో ఇద్దరు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు ఆమె వెంట ఉన్నారు.
Rahul Gandhi, Priyanka allowed to visit Hathras gang-rape victim’s familyహత్రాస్‌లో 144 సెక్షన్‌ అమల్లో ఉందని పోలీసులు తెలిపారు. హథ్రాస్‌ ఘటనకు ఐదు రోజుల తర్వాత అక్కడికి మీడియాను కూడా అనుమతించారు పోలీసులు. ఈ ఘటనలో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ ముగియడంతో మీడియాకు అనుమతినిచ్చామని తెలిపారు.హత్రాస్‌ గ్రామంలో 20 ఏళ్ల యువతిపై సెప్టెంబర్‌ 14న నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలు మరణించింది. దీంతో హత్రాస్ లో ఒక్కసారిగా ఉద్రిక్తతలు పరిస్థితులు నెలకొన్నాయి.

Related Tags :

Related Posts :