Rahul Gandhi Provides 175 Smart Televisions To Wayanad Tribal Students For Online Education

గిరిజన విద్యార్థుల Online చదువుకోసం స్మార్ట్‌ టీవీలు ఇచ్చిన రాహుల్ గాంధీ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కేరళలోని వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తన నియోజకవర్గంలోని గిరిజన విద్యార్థులకు స్మార్ట్‌ టీవీలు అందజేశారు. ఆన్‌లైన్ తరగతుల కోసం 175 స్మార్ట్ టీవీలను జిల్లా యంత్రాంగానికి బుధవారం అప్పగించారు. కరోనా కష్టకాలంలో లాక్ డౌన్ తో దేశవ్యాప్తంగా స్కూళ్లు తెరుకోవట్లేదు. కానీ స్కూల్స్ మాత్రం ఆల్ లైన్ లలో క్లాసులను నిర్వహిస్తోంది. ఈక్రమంలో కేరళ ప్రభుత్వం ‘ఫస్ట్ బెల్’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఆన్‌లైన్‌ తరగతులను ప్రారంభించింది. విద్యార్దుల చదువులకు ఆటంకం కలగకుండా కేరళ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి రాహుల్ గాంధీ మద్దతిచ్చారు.

తన నియోజకవర్గంలోని పేద గిరిజన విద్యార్థులు ఈ ఆన్‌లైన్‌ క్లాసుల ద్వారా ప్రయోజనం పొందాలన్న ఉద్దేశంతో 175 స్మార్ట్ టీవీలను వారి కోసం కొన్ని జిల్లా యంత్రాంగానికిఅందజేశారు. అధికారులు వీటిని ఆ విద్యార్థులకు అందజేయనున్నారు.జూన్ 1 న కేరళ సీఎం పినరాయి విజయన్ కు రాహుల్ గాంధీ రాసిన లేఖలో..‘ఫస్ట్ బెల్’ కార్యక్రమంతో విద్యార్దులకు చదువులను కొనసాగించటం చాలా వినూత్నమైన కార్యక్రమం అని రాహుల్ ప్రశంసించారు.

సీఎం పినరాయి విజయన్ తీసుకున్న ఈ నిర్ణయం చాలామందిని..ఇది తాత్కాలిక ప్రత్యామ్నాయంగా పనిచేస్తున్నప్పటికీ..కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లు, కేబుల్ టెలివిజన్, ఇంటర్నెట్ కనెక్షన్ల వంటి డిజిటల్ మౌలిక సదుపాయాలకు విద్యార్థులకు అవసరం ఉంటుందని దానికి తాను మద్దతుతో పాటు సహాయాన్ని అందజేస్తానని తెలిపారు. ఈక్రమంలో మొత్తం 175 స్మార్ట్ టీవీలను అందజేశారు.

Read:మధ్యప్రదేశ్‌లో కొత్త మంత్రి వర్గం.. సింధియా శిబిరంలో 10మందికి చోటు

Related Posts