లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

Narendra Modi కంటే Rahul Gandhi ఫేస్‌బుక్ పేజ్‌ 40% ఎక్కువ ఎంగేజ్‌మెంట్

Published

on

కాంగ్రెస్ లీడర్ Rahul Gandhi ఫేస్‌బుక్ పేజ్‌కు ప్రధాని Narendra Modi పేజ్ కంటే 40శాతం అధిక ఎంగేజ్‌మెంట్ సాధించి రికార్డు సాధించింది. సెప్టెంబర్ 25నుంచి అక్టోబర్ 2వరకూ డేటా ప్రకారం.. వివరాలిలా ఉన్నాయి.

Facebook analytics ఆధారంగా.. కాంగ్రెస్ పార్టీ ఐదు పేజీలను మెయింటైన్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ పోస్టులతో 13.9మిలియన్ ఎంగేజ్మెంట్స్ ఉన్నాయని.. అంటే కామెంట్లు, లైకులు, షేర్లే వీటికి కారణం అని సమాచారం.సోషల్ మీడియాలో ఫాలో అయ్యే టాప్ మోస్ట్ వరల్డ్ లీడర్స్‌లో మోడీ ఒకరు. రాహుల్ గాంధీ(3.5 మిలియన్ ఫాలోవర్లు)తో పోల్చుకుని చూసుకుంటే మోడీ(45.9 మిలియన్ ఫాలోవర్లు)ఉన్నారు. కాంగ్రెస్ డేటా ఆధారంగా చూసుకుంటే గత వారం ఎంగేజ్మెంట్ 8.2 మిలియన్ మాత్రమే.

బీజేపీ అఫీషియల్ పేజ్‌లో 16మిలియన్ ఫాలోవర్లు ఉండగా.. 2.3 మిలియన్ మంది నుంచి మాత్రమే రెస్పాన్స్ వచ్చింది. అదే కాంగ్రెస్ పేజ్ నుంచి 3.6మిలియన్ మంది రెస్పాన్స్ దక్కింది. కాంగ్రెస్ కు ఫేస్‌బుక్‌లో 5.6మిలియన్ మంది ఫాలోవర్లు ఉన్నారు.ఈ గ్యాప్ లో రాహుల్ గాంధీ చేసిన 52 పోస్టులకు 3.5శాతం మంది ఫాలోవర్లు పెరిగారు. మోడీ.. యూఎన్ జనరల్ అసెంబ్లీ లాంటి మేజర్ ఈవెంట్లకు అటెండ్ అయి సెప్టెంబర్ 25నుంచి అక్టోబర్ 2వరకూ 11సార్లు మాత్రమే పోస్టు చేశారు.

కాంగ్రెస్ ఫంక్షనరీలోని ఒకరు మాట్లాడుతూ.. ‘నరేంద్ర మోడీ కంటే రాహుల్ గాంధీ ఎంగేజ్మెంట్ లైకులు, కామెంట్లు, షేర్లు లాంటి వాటి బట్టి చూస్తే కొద్ది వ్యత్యాసమే ఉంది. ఆడియెన్స్ అనే వారు కంటెంట్ తో ఎలా రిలేట్ అయి ఉన్నారనడానికి కీ ఇండికేటర్’ అని అన్నారు.‘నేను Hathras victim కుటుంబాన్ని కలిశాను. వారి బాధ నాకు అర్థం అయింది’ అని రాహుల్ గాంధీ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. ‘కష్ట కాలంలో వారికి తోడుగా నిలబడి న్యాయం జరిగేలా చూస్తాను. యూపీ ప్రభుత్వం చేద్దామనుకున్న ప్రతీది జరగనివ్వం. దేశమంతా ఆ కూతురి న్యాయం కోసం ఎదురుచూస్తుంది’ అని పోస్టు పెట్టారు.

దీనికి సోమవారం ఉదయం డేటా ప్రకారం.. 4లక్షల 50వేల లైకులు వచ్చాయి. Twitter, Facebookలాంటి సోషల్ మీడియాల్లో ట్రోల్స్ ఎదుర్కొన్న రాహుల్ గాంధీ సమస్యల దగ్గరకు నేరుగా వెళ్లడం మొదలుపెట్టారు. గత నెలలో ప్రవేశపెట్టిన చట్టాలకు వ్యతిరేకంగా ఖేతీ బచావో యాత్ర చేపట్టారు…అంతేకాకుండా.. కొవిడ్ 19 సంక్షోభం గురించి దేశ ఎకానమీపై పడిన ప్రభావం గురించి జరిపిన చర్చలను వీడియోల రూపంలో పోస్టు చేశారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *