ఉల్లిగడ్డ భూమిలో పెరుగుతుందో..బైట పెరుగుతుందో కూడా తెలియని రాహుల్ గాంధీ వ్యవసాయం చట్టంపై విమర్శలా?!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

‘Rahul is Not Even Aware if Onions Are Grown Inside Soil or Outside’: ఉల్లిగడ్డలు భూమిలో పెరుగుతాయో..బైట పెరుగుతాయో కూడా తెలియని రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయం చట్టంపై విమర్శలు చేయటమా? అంటూ మధ్యప్రదేశ్ సీఎం..శివరాజ్ సింగ్ చౌహాన్ సెటైర్లు వేశారు. ట్రాక్టర్లపై తిరుగుతూ విమర్శలు చేస్తే అవి వాస్తవాలు అయిపోతాయా? అని ప్రశ్నించారు.
ట్రాక్టర్లపై తిరిగినంత మాత్రాన రాహుల్ గాంధీ వ్యవసాయం గురించి తెలుసుకోలేరని.. సోఫాలో కూర్చుని ట్రాక్టర్ పై తిరుగుతున్నారని అటువంటి రాహుల్ గాంధీ వ్యవసాయ చట్టంపై విమర్శలు చేస్తున్నారంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు శివరాజ్ సింగ్ చౌహాన్.


వ్యవసాయం గురించి రాహుల్ కు ఏం తెలుసని వ్యవసాయ చట్టంపై విమర్శలు చేస్తున్నారు..ఆఖరికి ఉల్లిగడ్డ భూమి లోపల పెరుగుతుందో, బయట పెరుగుతుందో కూడా తెలియదంటూ ఎద్దేవా చేశారు. ఎన్డీయే సర్కారు తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులను కాంగ్రెస్ తీవ్రంగా విమర్శిస్తుండడాన్ని శివరాజ్ సింగ్ చౌహన్ ఈ విధంగా తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. రాహుల్ కు కనీసం వ్యవసాయంలో ఏఒక్క విషయం అయినా తెలుసా? అని ప్రశ్నించారు.


ఖేతీ బచావో యాత్ర పేరిట కేంద్రం బిల్లులపై నిరసనలు తెలుపుతూ రాహుల్ పంజాబ్ లో ట్రాక్టర్ యాత్ర నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ యాత్రపై బీజేపీ నేతలు రాహుల్ పై తీవ్రంగా మండిపడుతున్నారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూడా రాహుల్ ను వీఐపీ రైతు అంటే ఎద్దేవాచేస్తూ మాట్లాడారు.ట్రాక్టర్ పై మెత్తని పరుపు వంటి ఆసనంపై రాహుల్ కూర్చుని ఉన్న ఫొటోలు వైరల్ అవుతున్న నేపథ్యంలో మంత్రి ఇలా విమర్శలు కురిపించారు. మెత్తని సోఫాలో కూర్చుని యాత్రలు చేసే రాహుల్ కు రైతుల కష్టాల గురించి..వ్యవసాయం గురించి ఏం తెలుసని ఇలా యాత్రలు చేస్తున్నారంటూ విమర్శలు సంధించారు.

Related Tags :

Related Posts :