Rahul Sipligunj complains to police about assault on pub

మహళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు – పోలీసులకు రాహుల్ ఫిర్యాదు..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తనపై దాడి జరిగిన నేపథ్యంలో పోలీసులకు రాహుల్ కంప్లయింట్ చేసాడు..

హైదరాబాద్ గచ్చిబౌలి ప్రిజమ్(PRISM) పబ్‌లో బిగ్ బాస్-3 విన్నర్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. బీర్ బాటిల్స్‌తో విచక్షణా రహితంగా రాహుల్‌పై కొందరు యువకులు దాడికి పాల్పడ్డారు. గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుని డిశ్చార్జ్ అయిన రాహుల్ తనపై జరిగిన దాడికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసాడు.

తనపై కొందరు మూకుమ్మడిగా దాడి చేశారని కంప్లయింట్‌లో పేర్కొన్న రాహుల్.. తనతో పాటు ఉన్న ఫ్రెండ్స్ (మహిళలు) పై దాడిచేసి, అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని రాహుల్ ఫిర్యాదులో పేర్కొన్నాడు.(వీడియో.. చొక్కా చించి, మెడపై చేతులేసి, రౌండప్ చేసి, రాహుల్ సిప్లిగంజ్‌పై దాడి)

సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు పబ్ యాజయాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 324, 34 రెడ్‌విత్ కేసు రిజిస్టర్ చేశామని.. త్వరలోనే నిందుతులను పట్టుకుంటామని తెలిపారు. 

Related Tags :

Related Posts :