అషు రెడ్డితో రియల్ రిలేషన్‌ షిప్.. అనౌన్స్ చేసిన రాహుల్!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Rahul Sipligunj – Ashu Reddy: పాపులర్ టాలీవుడ్ యంగ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ అషు రెడ్డితో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశాడు. బిగ్‌బాస్ 3 లో పార్టిసిపేట్ చేసినప్పుడు అషుతో ఏర్పడ్డ పరిచయం, స్నేహంగా మారి ఆపై ప్రేమగా ముదరడంతో వీరిద్దరూ తమ రిలేషన్‌ను కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు తామిద్దరం రియల్ రిలేషన్‌లో ఉన్నామని రాహుల్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.


విజయ్‌ని కలిసిన వరుణ్ చక్రవర్తి


అషుతో డేటింగ్.. పునర్నవికి కౌంటర్..
అషు రెడ్డితో రాహుల్ డిన్నర్ డేట్‌కు వెళ్లాడు. ఈ విషయాన్ని అతడే తన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. ‘మేమిద్దరం సినిమా ప్రమోషన్ కోసమో.. వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసమో కలవలేదు. మేము నిజమైన రిలేషన్‌షిప్‌లో ఉన్నాం’ అంటూ ఇటీవల వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసం ఎంగేజ్‌మెంట్ డ్రామా ఆడిన పునర్నవికి కౌంటర్ ఇచ్చాడు. రాహుల్ చేసిన పోస్టుపై అలీ రెజా కూడా స్పందించడం విశేషం.Ashu Reddy

పునర్నవితో ప్రేమాయణం
బిగ్ బాస్ సీజన్ 3 లో రాహల్, పునర్నవి భూపాలం లవ్ ట్రాక్ హాట్ టాపిక్ అయింది. మూడో సీజన్ విజయం సాధించడానికి ఇదే ప్రధాన కారణం అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతలా వీళ్లిద్దరూ షోలో తరచూ హగ్ చేసుకోవడం.. ముద్దులు పెట్టుకోవడం.. డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుకోవడం వంటివి చేసి మాంచి మసాలా దట్టించారు.. అందుకే ఎంత పోటీ ఉన్నా రాహుల్ సీజన్ 3 టైటిల్ గెలుచుకున్నాడు.Rahul Sipligunj

 

View this post on Instagram

 

A post shared by Rahul Sipligunj (@sipligunjrahul)

Related Tags :

Related Posts :