Viral
కేటీఆర్ సార్ నాకు న్యాయం చేయండి – వీడియో షేర్ చేసిన రాహుల్ సిప్లిగంజ్..
తెలంగాణ మంత్రి కేటీఆర్ తనకు న్యాయం జరిగేలా చూడలంటూ దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వీడియో షేర్ చేసిన రాహుల్ సిప్లిగంజ్..
Home » కేటీఆర్ సార్ నాకు న్యాయం చేయండి – వీడియో షేర్ చేసిన రాహుల్ సిప్లిగంజ్..
తెలంగాణ మంత్రి కేటీఆర్ తనకు న్యాయం జరిగేలా చూడలంటూ దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వీడియో షేర్ చేసిన రాహుల్ సిప్లిగంజ్..
Published
12 months agoon
By
sekharతెలంగాణ మంత్రి కేటీఆర్ తనకు న్యాయం జరిగేలా చూడలంటూ దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వీడియో షేర్ చేసిన రాహుల్ సిప్లిగంజ్..
గత రెండు రోజులుగా వార్తల్లో నిలిచిన సింగర్, తెలుగు బిగ్‌బాస్-3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తనకు న్యాయం చేయాలంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశాడు. తనపై జరిగిన దాడి తాలూకు సీసీటీవీ ఫుటేజ్ (45 సెకన్లు) వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.
‘నాపై జరిగిన దాడికి సంబంధించిన వీడియో చూడండి సార్.. ఆ గ్యాంగ్ నన్ను ఎలా రెచ్చగొట్టారో, కొట్టారో చూడండి.. ఈ వీడియో చూసి నాకు న్యాయం చేయండి.. న్యాయం వైపు నిలబడండి.. కేటీఆర్ సార్, నేనెప్పుడూ టీఆర్ఎస్ పార్టీకోసమే పనిచేశాను. ఈ గడ్డ మీద పుట్టాను కాబట్టి టీఆర్ఎస్ పార్టీకే ఓటు వేశాను. నా ఊపిరి ఉన్నంత వరకు తెలంగాణకు సేవ చేస్తాను.. సార్ మాకు సేవ చేస్తారని నమ్మి మేము నాయకులను ఎన్నుకుంటాం.. కానీ వాళ్లు ఇలా అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదు.
మన సొంత టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సోదరులు పబ్లిక్‌లో ఇలా బిహేవ్ చేయడం చూసి షాక్ అయ్యాను. వాళ్ల సోదరుడికి అధికారం ఉందని అకారణంగా నామీద దాడికి పాల్పడ్డారు’.. అంటూ రాహుల్ పోస్ట్‌లో పేర్కొన్నాడు.
హైదరాబాద్ గచ్చిబౌలి ప్రిజమ్(PRISM) పబ్‌లో బిగ్ తనపై దాడి జరిగిన అనంతరం ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయిన రాహుల్ దాడికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
View this post on InstagramA post shared by Rahul Sipligunj (@sipligunjrahul) on
జూబ్లీహిల్స్‌లో ట్రాఫిక్ పోలీసులపై యువకుడు దాడి : బైక్ సైలెన్సర్ తీసేసి మితిమీరిన శబ్దంతో బైక్ నడుపుతూ రచ్చ
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గ్రామాలపై పులుల దాడులు.. భయాందోళనల్లో ప్రజలు
ఉద్యోగాల భర్తీ లెక్కలివే..తేల్చేసిన మంత్రి కేటీఆర్
మహబూబ్‌నగర్ జిల్లాలో సర్పంచ్ దాష్ఠికం : అక్రమాలను ప్రశ్నించినందుకు యువకుడిపై దాడి
ఏకంగా మినిష్టర్ కారుతో రేస్ పెట్టుకున్న టూరిస్టులు
ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహం