ప్రత్యేక రైళ్లకు టిక్కెట్ల బుకింగ్ లో మార్పులు

Railway changes rules for booking tickets of special trains.

ప్రస్తుతం నడుపుతున్న 30 ప్రత్యేక రైళ్ల బుకింగ్ కు సంబంధించి ఇండియన్ రైల్వే కొన్ని మార్పులు చేసింది. స్పెషల్ ట్రైయిన్స్ బుకింగ్ యొక్క టర్మ్స్ అండ్ కండీషన్స్ లో కొన్ని మార్పులు చేసింది రైల్వే శాఖ. అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్(ARP)ను ప్రస్తుతమున్న 7రోజుల నుంచి 30రోజుల వరకు పెంచింది.

ఈ రైళ్లల్లో ఎటువంటి తత్కాల్ బుకింగ్ ఉండదని రైల్వేశాఖ తెలిపింది. వర్తించే సూచనల ప్రకారం... ఈ రైళ్లలో ఆర్‌ఐసి / వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్లు ఇవ్వబడతాయి. అయితే వెయిట్‌ లిస్ట్ ప్యాసింజర్లు మాత్రం ఈ రైళ్లలో ఎక్కడానికి అనుమతించబడరు.

రైలు బయలుదేరే సమాయానికి కనీసం 4 గంటల ముందు మొదటి చార్ట్ తయారు చేయబడాలి మరియు రెండవ చార్ట్ రైలు బయలుదేరే కనీసం 2 గంటల ముందు(గతంలోని 30 నిమిషాల ముందులా కాకుండా)  తయారుచేయబడుతుంది. మొదటి మరియు రెండవ చార్ట్ మధ్య కరెంట్ బుకింగ్ అనుమతించబడుతుంది.

పోస్ట్ ఆఫీసులు, యాత్రి టికెట్ సువిధా కేంద్రా(YTSK) లైసెన్స్‌లు మొదలైనవాటితో కలిపి కంప్యూటరైజ్డ్ RPS కౌంటర్స్ ద్వారా టిక్కెట్ల బుకింగ్ అనుమతించబడుతుంది. అదే విధంగా,ఇండియన్ రైల్వే క్యాటరింగ్ & టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సిటిసి) మరియు కామన్ సర్వీస్ సెంటర్ల ఆథరైజ్డ్(ధృవీకరించిన) ఏజెంట్లతో సహా ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా టిక్కెట్ల బుకింగ్ అనుమతించబడుతుంది.

మరిన్ని తాజా వార్తలు