Railway Jobs | Railway Announces 13 847 Vacancies | 10TV

గుడ్ న్యూస్ : రైల్వేలో 13, 847 జాబ్స్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఢిల్లీ : ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికో ఓ న్యూస్. రైల్వే శాఖలో జాబ్స్ పడ్డాయి. మొత్తం 13వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు జనవరి 04వ తేదీ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. దేశ వ్యాప్తంగా వివిధ జోన్లలో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీర్ (జేఈ), జూనియర్ ఇంజినీర్స్ (ఇన్ఫరేషన్ టెక్నాలజీ), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (డీఎంఎస్), కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ (సీఎంఏ) పోస్టులు ఇందులో ఉన్నాయి. వేతన స్కేలు రూ. 35, 400 నుండి రూ. 1, 12, 400గా ఉంది. 13, 847 పోస్టులున్నాయి. 

  • కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టుకు ఫిజిక్స్, కెమిస్ట్రీతో బ్యాచిలర్ డిగ్రీ చేసి 45 శాతం మార్కులు పొందిన వారు అర్హులు. 
  • సంబంధిత సబ్జెక్టులో మూడేళ్ల డిప్లామా లేదా గుర్తింపు పొందిన సంస్థ నుండి ఇంజినీరింగ్ చేసి ఉండాలి.
  • డిపో సూపరింటెండెంట్ పోస్టులకు గుర్తింపు పొందిన వర్సిటీ / సంస్థ నుండి ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లామా చేసిన వారు అర్హులు…లేదా…సంబంధిత సబ్జెక్టులో ఇంజినీరింగ్ డిగ్రీ చేసిన వారు అర్హులు. 
  • జూనియర్ ఇంజినీర్ (ఐటీ) పోస్టులకు పీజీడీ సీఏ / బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) / బీటెక్ (కంప్యూటర్ సైన్స్) / డీవోఈఏసీసీ ‘బీ’ లెవెల్ మూడేళ్ల కోర్సు లేక తత్సమాన కోర్సు చేసిన వారు అర్హులు. 
  • 2వ దశ రిక్రూట్ మెంట్ పరీక్ష దరఖాస్తుకు ఆఖరి తేదీ జనవరి 31.
  • పోస్టులు జనవరి 1, 2019 నాటికి 18-33 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు అర్హులు. 

Related Posts